Friday, 2 October 2015

కన్న కొడుకు పోయినా...


బులుసు సాంబమూర్తి


     " కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన " అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించాడు. అంటే " నీ విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితం గురించి ఆలోచించబోకు; దాన్ని నాకు వదిలిపెట్టు "అని తాత్పర్యం. అలాగే కష్టసుఖాలను సమానంగా పరిగణించేవాడే స్థిత ప్రగ్నుడని గీత ప్రవచిస్తున్నది. కాని, అలా వ్యవహరించగలవారెందరు?

మహర్షి బులుసు సాంబమూర్తి ఆంధ్రనాయకులలో ప్రముఖుడు. ఆయన స్వాతంత్రోద్యమంలో ఎంతో త్యాగం చేశారు.

      కాగా, 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరుగుతున్నది. మహాసభ ఆహ్వాన సంఘానికి శ్రీ సాంబమూర్తి కార్యదర్శి. యావద్భారతం నుంచి వచ్చే ప్రతినిధులకు మూడురోజులపాటు  బోజన వసతి సౌకర్యాలు, మహాసభ ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత ఆయనిది. ఏర్పాట్లన్నింటిని సాంబమూర్తిగారు చురుకుగా చేస్తున్నారు.



     దురదృష్టవశాత్తు, మహసభ మరి 10, 12 రోజులున్నదనగా, సాంబమూర్తి గారి ఏకైక పుత్రుడు టైఫాయిడ్తో మృతిచెందాడు!

గంపెడు పుత్రశోకం! అవతల పుట్టెడు బాధ్యత!

       సాంబమూర్తిగారు మనోనిబ్బరం కోల్పోకుండా ఒక ప్రక్క కన్నీరు తుడుచుకుంటూనే మరోకవంక మహాసభ మహాభారాన్ని మోసి, ఆంధ్ర భోజనం రుచిని ఉత్తరాది మహనాయకులకు చూపించి, వారి మెప్పు పొందారు. ఆయన ఆధ్వర్యాన జరిగిన సభలలో ఒకటిగా పేరొందింది!

       సాంబమూర్తిగారి పుత్రశోకాన్ని, అయినా ఆయన కర్తవ్య పరాయణత్వాన్ని వివరిస్తూ " ఇండియన్నైటింగేల్‌ " సరోజీనాయుడు  అశువుగా అప్పటికఫ్ఫుడు ఆలపించిన విషాదగీతిక సభికులను కదిలించి, కన్నీరు తెప్పించింది!

అంతటి క్రమశిక్షనను అలవరుచుకోనడం అందరికి సులభసాధ్యం కాదు.

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...