Thursday, 22 September 2016

అద్భుత వైద్యం


      టెలీపతికి సంబంధించిన ప్రయోగాలు గడిచిన పాతిక సవత్సరాలలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. 1959లో జరిగిన ఒక ప్రయోగం వైజ్ఞానికంగా ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది.

       “నాటిలస్” ఒక జలాంతర్గామి పేరు. టెలీపతి ద్వారా మాట్లాడుకునే శక్తి కలిగిన ఇద్దరు వ్యక్తులలో ఒకరిని జలాంతర్గామిలో ఉంచి సముద్రంలో కొన్ని వందల అడుగుల లోతుకు పంపించారు. రెండవ వ్యక్తిని అక్కడికి కొన్ని వేళ్ళమైళ్ళ దూరంలో ఉంచారు. ఒక నిర్ణీత సమయంలో పరస్పరం వారిద్దరూ సంభాషించుకొనే ఏర్పాటు చేసారు. కొన్ని వందల అడుగుల నీటి క్రింద ఉన్న వ్యక్తి అక్కడకి వేళ్ళ మైళ్ళ దూరంలో వ్యక్తితో టెలీపతి ద్వారా విజయవంతంగా సంభాషించినట్లు ప్రయోగం నిర్వహించిన ఒక వైజ్ఞానికవేత్త నిర్ధారించారు.

    భావతరంగాలు మవునంగా గాలిలోనుంచో, సున్యంనుంచో వందల, వేళ్ళ మైళ్ళు ప్రయాణించటం వేరు. కొన్ని వందల అడుగుల మందంలో ఉన్న నీటి పొర నుండి పయనించటం వేరు. గాలినుండి, శూన్యం నుండీ రేడియో తరంగాలు ప్రయాణిస్తాయి, కాని అలా సముద్ర జలాల్లో అంత దూరం చొచ్చుకుపోలేవు.

        టెలిపతి శక్తి కలిగిన వ్యక్తులు ఎంతో దూరంలో ఉన్నా, ఎక్కడున్నా, టెలిఫోన్, టెలిగ్రాఫ్ లాంటి సాధనాలేవి లేకుండా సంభాషించుకోవటం “నాటిలేస్” ప్రయోగం రుజువు చేసింది. టెలిపతి శక్తిని పరీక్షించడానికి అమెరికాలో ‘హెన్స్కాంబ్ ఫీల్డ్’(బెడ్ఫోర్డ్) అనే చోట శాస్త్రజ్ఞులు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులలో ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, ఒక మెకానికల్ ఇంజినీర్ ఉన్నారు.

మరొక సంఘటన చూద్దాం....



    ఎడ్గార్ ఒక రైతు కొడుకు. అతని మెదడులోని అసాధారణ ప్రజ్ఞా విశేషాలు అమెరికన్ మెడికల్ అసోషియేషన్నూ ఆకర్షించాయి.

    ఎడ్గార్ జీవితం చిత్రమైనది. అతడికి చిన్నతనంలోనే పెద్ద దెబ్బ జబ్బు చేసింది. విపరీతంగా జ్వరం వచ్చి అపస్మారక  స్థితిలో పడిపోయాడు. సృహ తెప్పించడానికి ఆ మందులు, ఈ మందులు ఇచ్చి అవస్థ పడుతుండగా, అపస్మారక స్థితిలోనే ఎడ్గార్ ఉన్నట్లుండి స్ఫుటంగా బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆశ్చర్యపోతున్న డాక్టర్లకు తానూ ఎందువల్ల అనారోగ్యం పాలైనది వివరించాడు. కొన్ని మూలికలు పేర్లు చెప్పి, వాటిని అరగదీసి తన వెన్నుముకకు పూస్తే జబ్బు తగ్గిపోతుందన్నాడు.

     ఎడ్గార్ చెప్పిన మాటలు ఏవో అపస్మారకంలో మాట్లాడినట్లు లేవు. ఆరి తేరిన డాక్టర్ లా మాట్లాడాడు. అక్కడున్న డాక్టర్లు, బంధుమిత్రులు ఈ వింత ఏమిటో అర్ధం కాకపోయినా, ఎడ్గార్ చెప్పిన మూలికలు తెచ్చి, అతను చెప్పినట్లే వెన్నెముకకు మూలికల గంధం పుశారు. కొద్ది రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ వార్త దేశమంతటా పోక్కిపోయింది. కొంత మంది పెద్దలు  ఎడ్గార్ ను హిప్నటైజ్ చేసి అనారోగ్యానికి మందు అడిగితె బావుంటుందని సూచించారు. ఎడ్గార్ దానికి సుతనాము అంగికరించలేదు. ఇలా ఉండగా ఒక రోజున అతని ఆప్తమిత్రుడోకరు జబ్బు పడ్డారు. ఎడ్గార్ లాటిన్ లో కొన్ని మాటలు చెప్పి, తానూ కొన్ని మాటలు చెప్పి, తానూ కొన్ని మందుల పేర్లు చెప్తానని అవి తీసుకురమ్మని పురమాయించాడు.

      ఎడ్గార్ లాటిన్ కాదుకదా, మరే భాష చదువుకున్నవాడు కాదు. ఈ వింత ఏమిటో చూద్దామని అతను చెప్పిన మందులు తెచ్చి వాడారు. స్నేహితుడి ఆరోగ్యం విచిత్రంగా మెరుగైంది. అమెరికన్ మెడికల్ అసోషియేషన్ ఒక కమీషన్ ను నియమించి, ఇలాంటి మరొక సంఘటన జరిగితే సమగ్ర విచారణ జరపవలసిందిగా ఆదేశించింది.  

   ఒకసారి మహా సంపన్నుడొకరికి ఎడ్గార్ ఎదో మందు చెప్పాడు. ఆ మందు అక్కడున్న డాక్టర్లేవరికి తెలియదు. ఎప్పుడూ వినను కూడా లేదన్నారు. శ్రీ మంతుడు ఎందుకైనా మంచిదని అంతర్జాతియ ప్రచారం గల పత్రికలో ప్రకటన వేయించాడు. ప్రకటన ఫలించింది. ఫారిన్ నుండి ఒక యువ డాక్టర్ ఉత్తరం వ్రాశాడు. అతడి తండ్రి చాల కాలం క్రిందట ఈ మందును తయారు చేసేవాడట. ఇప్పుడు చేయటం లేదు. ఎడ్గార్ చెప్పినదానికి ఈ మందు సరిగ్గా సరిపోయింది. ఆ డాక్టర్ ఆ మందు తాయారు చేసాడనుకోండి- అది వేరే విషయం.


     మరొక సందర్భంలో ఎడ్గార్ మరో మందు పేరు చెప్పి, అక్కడికి చాల దూరంలో ఉన్న ఫలానా వూళ్ళోని ఫలానా లేబరేటరీకి వెళితే అక్కడ ఆ మందు దొరుకుతుందని చెప్పాడు. అక్కడికి ఫోన్ చేస్తే  మందు ఉన్నదని సమాదానం వచ్చింది. టెలిపతి అంటే నాన్సెన్స్ అని కొట్టిపారేసిన కమిషనర్ల బృందం యదార్ధాన్ని అంగికరించ తప్పలేదు. ఎడ్గార్ ఏనాడు ఒక వైద్య శాస్ర్త గ్రందాన్ని కూడా చదవలేదు. అసలు అతడి చదువే అంతంతమాత్రం. ఆశ్చర్యకరంగా మందులు వ్రాసి ఇస్తుంటే డాక్టర్ల తలలు తిరుగుతుండేవి. దేశం అంత అతడి పేరు మోగిపోయింది. రోజుకు రెండు సార్లు అతడు ఎక్కడి ఎక్కడినుంచో వచ్చే రోగులకు అతడి మందులు వ్రాసి ఇస్తుండేవాడు.

సౌజన్యం : డా|| బి.వి. పట్టాభిరామ్ 

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...