Friday, 4 September 2015

దెయ్యలున్నాయా?


కందూకూరి వీరేశలింగం


             మూఢ విశ్వాసాలంటే గుర్తుకు వచ్చింది. నవయువ వైతాళికుడుగా పేరొందిన కందూకూరి వీరేశలింగం గారు తెలుగు సాంఘీక, సాహిత్య రంగాలలో తనకోక విశిష్టమైన ముద్ర వేసుకున్నారు. 
           
          క్రిందటి శతాబ్దిలో సంఘసంస్కర్తగా, నవల రచయితగానే కాక, ప్రముఖ హేతువాదిగా కూడా ఆయన పేరు పొందారు. వితంతువుల పునర్వివాహాలకు ఆయన శ్రీకారం చుట్టారు. మూఢ విశ్వాసాలను తెగనాడారు. భూత ప్రేత పిశాచాల నమ్మకాలు భ్రమలని ఆయన స్వయంగా నిరూపించారు.

           అది రాజమండ్రి పట్టణం. దీర్ఘవ్యాదితో బాధపడుతున్న ఒక వ్యక్తికి జబ్బు కుదుర్చుతానని ఒక భూతవైద్యుడు నెల రోజులుగా " హ్రం, హ్రీం " అంటూ హంగామా చేస్తున్నాడు. మంత్రాలెన్ని చదివినా జబ్బు మాత్రం కుదరలేదు. కాని, నెలరోజులైనాక ఆ భూతవైద్యుడు తన ముడుపు మాత్రం తనకు ముట్టవలసిందేనని హూంకరిస్తున్నాడు. 



            పేదవారయినా ఆ ఇంటివారు జబ్బు కుదరక , డబ్బు పోతున్నదని బాధపడుతున్నారు. ఇంతలో ఆ ప్రక్క ఇంటివారి బక్క పలుచటి అబ్బాయి వచ్చి, సంగతి తెలుసుకోని, " డబ్బివ్వరు, దిక్కున్నచోట చెప్పుకో " మని భూతవైద్యునితో బూకరించాడు. " నిన్ను చేతబడి చేసి, చంపేస్తా " నని భూతవైద్యుడు బుకాయించాడు.

         " నీ కంటె నాకు మంత్రాలే వచ్చు. మళ్ళీ మాట్లాడావంటే నా శరభ సాళ్వ మంత్రం చదివి నిన్ను ఇక్కడే నెత్తురు కక్కిస్తాననేసరికి ఆ మంత్రం పేరే ఎన్నడూ వినని  ఆ భూతవైద్యుడు మంత్ర పఠనం మాని పలాయన మంత్రం పఠించాడు. దానికి మించిన మంత్రం మరిలేదు కదా!

ఆ బక్క పలచటి యువకుడే- కందూకూరి విరేశలింగంగారు.

          పాపం, ఆయన తల్లికి దయ్యాలచెబితే , భూతాలంటే విపరీతమైన నమ్మకం. ఆమెకు భూతవైద్యం చేయడానికి వచ్చిన మాంత్రికులకు దయ్యాలను చూపించమని ఆయన అడిగేవాడు. ఎవరో శ్మశానంలో  భూతాలుంటాయని చెబితే, వీరేశలింగంగారు రాత్రిళ్ళు శ్మశాన వాటికకు వెళ్ళి, అక్కడ దయ్యాలకోసం కాపలా కాసేవాడు.

      చివరికి దయ్యాలు భూతాలులేవని, అవి మానవుని మానసిక దౌర్బల్యం నుంచి జనించిన ఊహజీవులని ఆయన నిర్ధారించారు. ఒకసారి రాజమండ్రిలో ఆయన ఉంటున్న ఇంటిలో అరటిగెల మొవ్వ నుంచి కాక, మధ్యనుంచి బయలుదేరింది. ఇది అరిష్ట సూచకమని, ఆ చెట్టును కొట్టి వేయాలని చాలమంది చెప్పగా, వీరేశలింగంగారు వినకుండా అరిటిగెలలను కొట్టి, కూర వండించి తిన్నాడు. ఆయనకు ఏమి కాలేదు.

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...