Wednesday, 26 August 2015

మీకు తెలుసా ?

   

                ప్రముఖుల జీవిత చరిత్రలు ఆసక్తిదాయకాలు. అయితే సుదీర్ఘమైన జీవీత చరిత్రలు చదివే ఓపిక , తీరిక ఇప్పుడు చాలమందికి ఉండవు. ప్రసిద్ద వ్యక్తుల జీవిత చరిత్రలోని కొన్ని ఉపాఖ్యానాలు , హాస్యోక్తులు ,ఆసక్తికరమైన సంఘటనలు మరుపురానివి . అవి వినోదాన్నే కాదు వికాసాన్ని కూడ కలిగిస్తాయి! అలాంటి సంఘటనలు కొన్ని ఇక్కడ మనం చూద్దాము.



                                                                   గాంధీజీ
   
       రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తన ఆత్మబలంతో , సత్యాహింసలతో ఆయుధాలతో ఎదిరించి, గెలిచిన మహాత్మగాంధీ చిన్నప్పుడు వట్టి పిరికి. నలుగురితో మట్లాడాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బిడియపడేవాడు . రాజ్ కోట హైస్కూలులో విద్యాభ్యాసానంతరం బారిష్టరీ చదవడానికి లండను వెలుతున్న గాంధీజీకి ఉపాధ్యాయులు , విద్యార్ధులు వీడ్కోలు సభ జరిపారు .లండను  క్షేమంగా వెళ్లీ లాభంగా రమ్మని ఉపాధ్యాయులు , విద్యార్ధి నాయకులు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత వీడ్కోలు సన్మానానికి జవాబు చెప్పవలిసిందిగా గాంధీజీని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించాడు.



                    సమాధానం అనేసరికి గంధీగారు గడగడ వణకడం ప్రారంభించారు.గుండెలు కొట్టుకోసాగాయి. అంతకు పూర్వం ఆయన బహిరంగ సభలో ఎప్పూడూ మాట్లాడి ఎరగరు. అందువల్ల, " నేను మాట్లాడలే " నని ఆయన చేతితో సైగ చేసి కూర్చునారు. తోటి విద్యార్ధులందరు గొల్లుమన్నారు! తరువాత బారీష్టరీ ప్యాసయి  వచ్చిన గాంధీజీకి దక్షిణాఫ్రికాలోని ఒక కోర్టులో తన తరుపున వాదించడానికి అబ్ధుల్లా అనే క్లయింటు వకాల్తా ఇచ్చాడు.

                         కోర్టులోఉన్న ప్లీడర్లను, క్లయింట్లను , జడ్జీని చూచేసరికి గాంధీజీకి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ముచ్చెమటలు పొశాయి. నోటమాట రాలేదు.తాను కోర్టులో వాధించలేనని గంధీజీ భావించి, " నాకు ఈ వకాల్తా వద్దు , ఫీజు వద్దని " ఆ ఫైలును బల్లమీద కొట్టి కోర్టునుండి వెళ్లిపొయారు.
       
         అలా పదిమందిలో నోరు తెరవడానికి గడగడలాడిపోయిన గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో్ పాల్గోన్న తరువాత , లక్షలాదిమంది పాల్గోన్న వేలాది సభలలో అనర్గళమహోపన్యాసాలు చేశారు.తన వచో విభవంతో లక్షాలాది భారతీయులను ప్రభావితం చేశారు; వారిలో స్వాతంత్ర్యాగ్ని రగుల్కోలిపారు! ఆశ్చర్యం! తనకు జరిగిన సత్కారానికి నాలుగు మాటలైన చెప్పలేని ఆయన 1947 మార్చిలో ఢిల్లిలో జరిగిన అఖిలాసియా రజ్యాల మహాసభలో చేసిన మహోపన్యసాన్ని విన్న వివిధ దేశాల ప్రతినిధులు ఆయనకు " మహా ప్రవక్త " అని ప్రస్తుతించారు.

                           ఆత్మ విశ్వాశంతో, దీక్షతో, పట్టుదలతో , సాదించలేనిది లేదని, సభా పిరికి అయినా సభా కేసరి కావచ్చుననడానికి మహాత్మగాంధి జీవితంలోని ఈ రెండు సంఘటనలు మరుపురానివి.

తెలుగు సామెతలు



రెండవ భాగం






చాలుపై చాలు దున్నితే చచ్చు చేనైనా పండుతుంది
చిత్త చినుకు తనకు చిత్తమున్నచోటే పడుతుంది
చినికి చినికి గాలివాన ఐనట్లు
చచ్చిన పామును కొట్టినట్లు
చింత చచ్చిన పులుపు చావదు
చిత్త చిత్తగించి స్వాతి చల్లచేసి విశాఖలో విసురుకుంటే అనురాధలో అడిగినంత పందుతాను అంటుంది భూదేవి
చెట్టు చచ్చినా చావ చావదు
చెట్టు నాటేదొకడు ఫలితం అనుభవించేదొకడు
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లు
చెరువు ఎండితే చేపలు బయట పడతాయి 
చెట్టు ముందా విత్తు ముందా?
చొప్పవామిలో నిప్పు దాచినట్లు
చేప పిల్లకు ఈత నేర్పాలా?
చెవి దగ్గర జోరీగ
చేనికి గట్టు ఊరికి కట్టు
జింక ఏడుపు వేటగానికి ముద్దా?
జీలకర్ర లో కర్ర లేదు నేతిబీర లో నెయ్యి లేదు
జీతం బెత్తం లేకుండా తోడేలు మేకలు కాస్తాదన్నదట
తినటానికి తిండిలేదు మీసాలకు సంపేంగ నూనె
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయ?
తాను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్లు
తీగ లాగితే డోంక కదిలినట్లు
తులసివనంలో గంజాయి మొక్క
తామరాకు పై నీటిబోట్టు
తినగ తినగ వేము తియ్యన
తీగకు కాయ బరువా?
తొలకరి వానలు మొలకలకు తల్లి
తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు
తూనీగలాడితె తూమెడు వాన
తొలికరికి చెరువు నిండినా తొలిచూలికి కొడుకు పుట్టినా లాభం
దగ్గుతూ పోతె శొంటి వెల కూడ పెరుగుతుంది
దూడ కుడిస్తే గాని ఆవు చేపదు
దప్పికగోన్నపుడు బావి తవ్వినట్లు
దుక్కిలేని చేను తాలింపు లేని కూర
దొరల చిత్తం, చెట్ల నీడ నిలకడ లేనివి
దుక్కి కొద్దీ పంట
దీపావళికి దీపమంత చలి
నక్క వినయం కొంగ జపం
నల్లకోడికైనా తెల్ల గుడ్డే
నాగలి మంచిది కాకపొతె ఎడ్లు ఎంచేస్తాయి?
నలుగురు నడిచె దారిలో గడ్డి కూడ మొలవదు
నల్ల రేగడిలో చల్లినా తెల్ల జోన్నలే పండేది
నారు పోసినవాడు నీరు పోయక మానడు
నీరు పల్లం ఎరుగు నిజం దేవుడెరుగు
నిద్ర చెడుతుందనని నల్లి కుట్టుకుండునా?
నువ్వుకు నూరు రొగాలు
నిప్పుకు చెదలంటునా?
నేటి విత్తే రేపటి చెట్టు
పండ్లు చెట్టుకు భారమా?
పందికేమి తెలుసు పన్నీరు వాసన
పంది ఎంత బలిసినా నంది కాదు
పది మంది పడ్డ పాము చావదు
పాలపిట్ట దర్శనం కడుపునిండా భోజనం
పాలకొసం పొదుగు కోసినట్లు
పాలు తాగి రొమ్ము గుద్దినట్లు
పిట్టకొంచెం కూత ఘనం
పెరిటి చెట్టు ముందుకు రాదు
పులి దాక్కోవటం పైకి దూకటానికే
పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
పిల్లకాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ
పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు
పూవు పుట్టగానే పరిమిళంచినట్లు
పత్తికి పది చాళ్లు జొన్నకు ఏడు చాళ్లు
పొద్దు పొడుపున వచ్చిన వాన ,పొద్దిగూకి వచ్చిన చుట్టం పోరు
ప్రాయంలో పంది పిల్ల కూడ బావుంటుంది
ఫలానికి తగిన భీజం నేలకు తగిన నీరు
బర్రె చస్తే పాడి బయట పడుతుంది
బెల్లమున్న చోటే ఈగలు ముసురేది
బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చచ్చినట్లు
భరణిలో బండలు పగులును, రోహిణిలో రాళ్లు పగులును
మంచిగొడ్డు ఊళ్లోనే అమ్ముడు పోతుంది
మొక్కయి వంగనిది మానై వంగుతుందా
మునగ చెట్టుకు మున్నూరు రోగాలు
మాహా వృక్షం కింద మొక్కలు బతకవు
మృగశిర చిందేస్తే ముసలి ఎద్దు రంకేస్తుంది
మేయబోతే ఎద్దులలోకి దున్నబోతే దూడలలోకి
రేపటి నెమలి కంటె ఈనాటి కాకి మేలు
రొయ్యకు లేదా బారెడు మీసం
రేవతి వర్షం ఎంతో రమణీయం
వడ్లు గోడ్లు ఉన్నవాడిదే వ్యవసాయం
వంగకు ముదురు నాటు అరిటికి లేత నాటు
వాన వచిన్నందుకు వాగు పారిందే గుర్తు
వానలుంటే పంటలు లేకుంటె మంటలు
వాన రాకడ ప్రాణం పోకడ
వట్టి గొడ్డుకు అరుపులెక్కువ, వాన లేని మబ్బుకు ఉరుములు ఎక్కువ
విత్తు ఒకటి వేస్తే చెట్టు మరోకటి మొలచునా?
వ్యవసాయం వెర్రివాని చేతి రాయి
విత్తనం కొద్దీ మొక్క
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు
హంస నడకలు రాకపోయే కాకి నడకలు మరిచిపోయే
హస్తకు ఆది పంట చిత్తకు చివరి పంట
క్షేత్రమెరిగి విత్తనం పాత్రమెరిగి దానం

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...