Thursday, 8 September 2016

మట్లాడే దెయ్యం


     1762వ సంవత్సరం లండన్ మహానగరలోని ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచురించింది.లండన్ నగరంలోని కాక్లేన్లో ఒక ఇంట్లో దెయ్యం ప్రవేశించిందని, అది మాట్లాడుతుందని, ఎన్నో వింతపనులు పనులు చేస్తుందనీ పత్రికలు ప్రచురించాయి.

         ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు డాక్టర్లు, విమర్శకులు, రచయితలు ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటి యజమాని కెంట్ వారితో " ఆ దెయ్యం ఎవరోకాదనీ, ఇటివల మరణించిన తన భార్యే దెయ్యమై పీడిస్తుందనీ, సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో వచ్చి అనరాని మాటలు అంటుందని" మొత్తుకున్నాడు.

          తరువాత 14 ఏళ్ల ఒక అమ్మాయిని పరిచయం చేసి " ఆమె తన భార్యకు మొదటి భర్త వలన కలిగిన సంతానం అని, ఆరు నెలల ప్రాయంలోనే ఈ పాప తన వద్దకు వచ్చిందని అప్పటినుండి తన కన్న కూతురిలా చూసుకుంటున్న అని"వారితో చెప్పాడు.

    ఇంతలో 8 అయింది. అందరూ చెవులు రిక్కించుకొని వింటున్నారు.ఆ గదిలో నిశబ్ద వాతావరణం ఆవరించి ఉంది.హటాత్తుగా " మిస్టర్ కెంట్! " అనే పిలుపు వినపడింది,అంతే ! అక్కడున్న వారిలో కొందరు కంగారుపడి అటూ ఇటూ చూశారు. కొందరికి భయం కుడా వేసింది. ఇంతలో మళ్లి " కెంట్ ! నువ్వు నన్ను విషం పెట్టి చంపావు. నేను నిన్ను క్షమించను.నువ్వు నా కూతురిని కుడా సరిగ్గా చూడటం లేదు. దానిని కుడా చంపడానికి పన్నాగం పన్నుతున్నావు. కాని నీ ఆటలు సాగవు. నీ అంతూ తేలుస్తాను అన్నది. ఆ తరువాత మాటలు లేవు. అది విన్న ఇద్దరు రచయితలకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక వ్యక్తీ సృహతప్పి పడిపోయాడు.




      ధైర్యం ఉన్నవాళ్ళు, హేతువాదం మీద నమ్మకం ఉన్నవాళ్ళూ రూమంతా పరికించి చూశారు. ఎక్కడైనా టేప్ రికార్డర్ లాంటి సాధనాలు ఉన్నాయోమోనని పరీక్షించారు. అటువంటిదేమి కనపడలేదు. ఈ సంగటనను ఇదే ప్రకారంగా నాలుగు సార్లు వరసగా చూసిన ప్రఖ్యాత డాక్టర్, రచయిత అయిన సామియేల్ జాన్సన్ ఆ విషయంపై పూర్తి నమ్మకం కలిగిన తరువాత ఒక పెద్ద నవల వ్రాసి, "కేవలం యదార్ధ సంగటనల తో కూడిన మొట్టమొదటి నవల " అనే పబ్లిసిటితో విడుదల చేశాడు. అది దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోయింది.

         ఆ నవలపై రోజు రోజుకు మోజు పెరుగుతున్నా, కొందరు పారా సైకాలజిస్టులు మాత్రం దేశం అన్యాయంగా మూడ నమ్మకాలకి బలి అయిపోతుందని  వాపోయారు. ప్రొఫసర్ డి. డి. హోమ్ ఆధ్వర్యంలో కొందరు పార సైకాలజిస్టులు, ముగ్గురు హేతువాదులూ కలిసి ఈ విషయాన్ని ఏకధాటిగా మూడు రోజులు చర్చించి దయ్యం మాట్లాడినట్టుగా చేయగలిగే పద్దతులను కొన్ని ఉహించి కొన్ని మర్నాడు కెంట్ ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు.

   మర్నాడు అనుకున్న పధకం ప్రకారం విడి విడిగా ఆ ఇంటికి ఏడూన్నార ప్రాంతంలో వెళ్ళారు.వెళ్లగానే ఎలిజిబెత్ ఎదురయి " ఈ మధ్య దెయ్యం నెలకోసారి వస్తుందని, బహుశా ఈ రోజు రావచ్చుని, వేచి చూడమని " చెప్పింది. ఇంతలో కెంట్ కూడా వచ్చాడు. సరిగ్గా ఎనిమిది అయింది.అందరూ నిశబ్దంగా ఉండగా దెయ్యం మాట్లాడటం మెదలు పెట్టింది. ప్రొఫెసర్ డి.డి. హోమ్ హటాత్తుగా ఎదో కనిపెట్టినట్లుగా లేచి, ఆ అమ్మాయి పీకను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. మరుక్షణం మాటలు ఆగిపోయాయి.

     పోలిస్ స్టేషన్ లో పెట్టిన చిత్రహింసలు భరించలేక ఎలిజిబెత్ నిజం చెప్పేసింది. ఇన్నాళ్ళూ తను "వెంట్రలాక్విజం"( పెదమలు కదపకుండా మాట్లాడే పద్దతి ) ద్వారా మాట్లాడి భయపెట్టానని, అది దెయ్యం అనే బ్రమ కలిగించానని ఒప్పుకుంది. ఇది తను స్వతహాగా చేయలేదని తన అసలు తండ్రి ప్రోద్బలంతో చేశానని చెప్పింది. అలా దెయ్యం అని చెప్పి బయపడితే కెంట్ భయంతో జబ్బుపడి మరణిస్తే , ఆ ఆస్తితో మేమిద్దరం హాయిగా కలిసి ఉండవచ్చునని తన అసలు తండ్రి చెప్పాడని కుడా ఒప్పుకుంది.

    ఎలిజిబెత్ మైనరని చెప్పి పోలీసులు వదిలేశారు. ఆమెను ప్రజలు కుడా కొన్నాళ్ళకు మరచిపోయారు. కాని ఈ కధను రాసి, పేరు సంపాదించిన డాక్టర్ జాన్సన్ మాత్రం ఒక విదుషుకుడుగా ఇంగ్లాండు ప్రజలకు ఈ రోజు దాక గుర్తొస్తాడు.



సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...