Saturday, 10 September 2016

టెలిపతి - బ్యాంకు దోపిడీ

           అతీంద్రియ శక్తులను గురించి పరిశోధనలు రెండవ ప్రపంచయుద్ద కాలం నుండి వేగం పుంజుకున్నాయి. అసలు అతీంద్రియ శక్తులు నిజమో, కాదో ఆలోచనలు అందరికి కలిగినట్లే స్టాలిన్ లాంటి ప్రముఖులకు కలిగాయి ఆ రోజుల్లో.

            స్టాలిన్ నిర్మిస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు, అతీంద్రియ విజ్ఞానానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, నిజ నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన 1940లో స్వయంగా ఒక పరిక్ష జరిపించారు. 

         రెండవ ప్రపంచ యుద్దకాలంలో 'టెలిపతి' ప్రదర్శించిన వారిలో ఒల్ఫ్ మేస్సింగ్ ప్రసిద్దుడు. ఆయన పోలెండ్ దేశస్థడైనప్పటికి ప్రపంచం అంత అయన పేరు మారు మ్రోగింది. స్టాలిన్ ఆయనను పిలిచాడు. "కధలు చెప్పడం కాదు, కళ్ళెదుట చూపించు నమ్ముతాను" అన్నాడు.

            నోరు మెదపకుండా, సంజ్ఞలు చేయకుండా, రాసి చూపించకుండా తన మనసులో వచ్చిన ఆలోచనలను స్పష్టంగా ఎదుటివాడి మనసులో ప్రవేశ పెట్టగలగటం మేస్సింగ్ కు సులువు సూత్రం. ఎదుట ఉన్న వ్యక్తినే కాదు, ఎంత దూరంలో ఉన్నాసరే ఎదుటలేని వ్యక్తికీ సైతం తన భావాలను అయన ప్రసారం చేయగలడు. అదే టెలిపతి.



            మస్కోలోనే మేస్సింగ్ శక్తుల పరీక్షకు ఏర్పాటు జరిగింది. పలానా బ్యాంకుకు వెళ్లి టెలిపతి విద్య  సహాయంతో డబ్బు తీసుకురమ్మని ఆదేశించాడు స్టాలిన్. అలా డబ్బు తీసుకురావడం మోసమే అవుతుంది. అయినప్పటికీ అది పరిక్ష మాత్రమె కాబట్టి అందుకు ఒప్పుకున్నాడు. స్టాలిన్కు నమ్మకం ఉన్న ఐదుగురు సాక్షులను వెంటబెట్టుకొని బ్యాంకుకు వెళ్ళాడు. తిన్నగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి, ఒక తెల్ల కాగితం క్యాషియర్ కి ఇచ్చి లక్ష రుబుల్స్ ఇమ్మన్నాడు. అలా అంటున్నప్పుడే అవసరమైన భావ ప్రసారం జరిగిపోయింది. చేక్కుపై డబ్బు ఇవ్వడానికి సంబంధించిన లాంచానాలన్ని పూర్తి ఐనట్లు, డబ్బు ఇవ్వడమే తరువాయి అన్నట్లు క్యాషియర్ మనసులో అభిప్రాయం నాటుకుంది. చిరునవ్వుతో లక్ష రుబుల్స్ లెక్కపెట్టి  ఇచ్చాడు.

          మేస్సింగ్ తన వెంట వచ్చిన ఐదుగురు సాక్షులకు డబ్బు చూపించి ప్రదర్శన విజయవంతమైందని వారు అంగికరించినాక, మళ్ళి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి, తను ఇంతకముందు ఇచ్చిన లక్ష రుబుల్స్ చెక్కును ఒకసారి చూడమన్నాడు. క్యాషియర్ ఎంత వెతికితే మాత్రం అది కనిపిస్తుంది కనుక ! ఒక తెల్లకాగితం ముక్క మాత్రమే అతనకు అదనంగా కనపడింది. అతని వెన్నుముకలోనుండి వణుకు మెదలైంది. ముఖం వెలవెల పోయింది.

           మేస్సింగ్ సొమ్మును జాగర్తగా లెక్కపెట్టకోమని  తిరిగి ఇచ్చాడు. ఇదేమి అర్ధంకాక క్యాషియర్ మేస్సింగ్ కేసి, నోట్లకేసి, తెల్లకాగితంకేసి, మార్చి మార్చి చూసి ఆశ్చర్యంతో ముర్చపోయాడు. డాక్టర్ల చేసిన సపర్యల వలన క్యాషియర్ కోలుకున్నాడు. మేస్సింగ్ క్షమాపణ చెప్పుకున్నాడు.

   స్టాలిన్ కు నమ్మకం కుదిరింది. మేస్సింగ్కి ఈ అతీంద్రియ శక్తీ సహజంగానే లభించింది. ఆయన అభ్యాసం ద్వారా దానికి వెన్న పెట్టుకున్నాడు.

సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్ 

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...