Friday, 28 August 2015

రాధాకృష్ణన్‌ చెప్పిన కథ




          ప్రముఖుల జీవిత చరిత్రలు ఆసక్తిదాయకాలు . అయితే సుదీర్ఘమైన జీవీత చరిత్రలు చదివే ఓపిక , తీరిక ఇప్పుడు చాలమందికి ఉండవు. ప్రసిద్ద వ్యక్తుల జీవిత చరిత్రలోని కొన్ని ఉపాఖ్యానాలు , హాస్యోక్తులు , ఆసక్తికరమైన సంఘటనలు మరుపురానివి . అవి వినోదాన్నే కాదు వికాసాన్ని కూడ కలిగిస్తాయి ! అలాంటి సంఘటనలు కొన్ని ఇక్కడ మనం చూద్దాము.



సర్వేపల్లి రాధాకృష్ణన్‌




                 ప్రపంచ ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గొప్ప వక్త, మహ పండింతుడు . ఆయన డాక్టర్ రాజేంద్రప్రసాద్ తరువాత మన రెండవ రాష్టృపతి . ఆయన చమత్కార సంభాషణా చతురుడు . ఎదుటివారి పై సున్నితమైన చురకలు వేయటం లో దిట్ట.

              ఒకసారి ఆయన పాల్గొన్న ఒక విందు సమావేశంలో ఒక ఇంగ్లీష్ పెద్ద మనిషి తమ తెల్ల జాతిని తెగ పొగుడుతున్నాడు. అందులో నల్ల జాతులపై హేళన కూడ ధ్వనిస్తుంది . ఇది రాధాకృష్ణన్కు నచ్చలేదు . ఆ ఇంగ్లీష్ పెద్దమనిషి  " మా తెల్లవారిపై దేవునికి ప్రత్యేకమైన ప్రేమ మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా సృష్టించాడు . అందువల్లే మేము తెల్లగా, ఆకర్షణీయంగా వుంటాము " అన్నాడు.   






          వెంటనే డాక్టర్ రాధాకృష్ణన్‌ లేచి, " మిత్రులారా! దేవుడు ఒక రొట్టెను తయారుచేయదలుచుకున్నాడు. ఆయన దాన్నీ కాల్చగా , అది సరిగా కాలలేదు. కాలీ కాలకుండ వుంది దానినుంచే ఈ తెల్లవారు వచ్చారు.

            " ఆ రొట్టె సరిగ్గా కాలలేదని  , దేవుడు మరోక రోట్టెను తయారు చేయదలచాడు. ఈసారి అది మరీ నల్లగా కాలి మాడిపోయింది . దాని నుండి నీగ్రో జాతులు పుట్టుకువచ్చాయి. ఇలా కాదని , ఆయన మరోక రొట్టెను జాగ్రత్తగా శ్రద్దతో కాల్చాడు. అది సమపాళంగా కాలింది . దానినుండి భారతీయులు పుట్టకు వచ్చారు " అనేసరికి ఆ శ్వేత జాతీయుని ముఖం వెలవెలబోయింది!  





నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...