Tuesday, 25 August 2015

తెలుగు సామెతలు

మనకు పూర్వం ఎవరినోటివెంట విన్న ఎదోక సందర్భంలోకాని వాడుక భాషలోకాని సామెతలు వినిపిస్తూంటాయి. కాని నేడు తెలుగు ప్రజల వాడుక భాషలో English  పదాలు  వినవస్తూన్నాయి కాని సామెతలు కాదు కదా!  తెలుగే  కనుమరుగవుతుంది.

    అలాంటి రోజోల్లో మన పాత సామతెలు మనం ఎంతైన గుర్తుచేసుకొవలిసిన అవసరం ఉంది. అలాంటి సామెతెలు  అందించే ప్రయత్నమే ఇదిదయచేసి తప్పులు ఉంటె మన్నిచగలరు.




మొదటి భాగం


అందరికన్న తాడిచెట్టు పెద్ద
అంత ఉరిమి ఇంతేనా కురిసింది.
అందరికి అన్నం పెట్టెవాడు రైతే
అగ్నికీ వాయువు తోడైనట్లు
అందితే తియ్యన అందకపోతె పుల్లన
అడివిలో ఆంబోతై తినాలి
అయితే ఆరిక కాకుంటె కంది
ఆముదపు విత్తులు ఆనిముత్యాలగునా?
ఆకు నలిపినపుడె అసలు వాసన బయట పడేది
అన్నికార్తెలు తప్పినా హస్తకార్తె తప్పదు
ఆ పప్పు ఈ నీళ్ళకు ఉడకదు
అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
ఆకులున్న చెట్టుకే నీడ
ఆరికకు చిత్తగండం
అన్నీ వడ్డించినవాడికే అన్నం కరువు
అదును ఎరిగి సేద్యమూ పదును ఎరిగి పైరు
అరవై ఆరు వంటలు ఆవు చంటిలోనె ఉన్నాయి
అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఆకలి బాద తప్పదు
ఆవు చేలోమేస్తే దూడ గట్టున  మేస్తుందా?
ఆవు మేతలేక చెడితె  పైరు చూడక చెడింది
ఆవు ముసలిదైతె పాల రుచి తగ్గుతుందా?
ఆరుద్ర కురిస్తె దారిద్ర్యం లేదు
ఆవుపాడి ఎన్నాళ్ళూ? ఐశ్వర్యం ఎన్నాళ్ళూ? బర్రెపాడి ఎన్నాళ్ళూ? భాగ్యమెన్నాళ్ళూ?
ఆవులు ఆవులు పోట్లాడుకోని దూడకాళ్ళూ విరిగినట్లు
ఆవు ఎక్కడ తిరిగితేనేమి మన ఇంటికి వచ్చి పాలిచినట్లు
ఇంగవ కట్టిన గుడ్డ
ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు
ఇంటికి గుట్టు మడికి గట్టు
ఇంటి ఎద్దుకు బాడుగ ఎముంది?
ఇంట్లో ఈగల మోత బయట పళ్ళకీల మోత
ఇంట్లో పిల్లి బయట పులి
ఈగకు పుండే ఇంద్రలోకం
ఈగ వ్రణం కోరు నక్క శవం కోరు
ఈనిన పిల్లికి ఆకలి ఎక్కువ
ఈతగింజనిచ్చి తాటిగింజను లాగేవాడు
ఈగను కప్పమింగితే కప్పను పాము మింగుతుంది
ఉత్తరం ఉరిమితే కురవక మానదు
ఉరిమిన మబ్బు కురవక్ మానదు
ఉడత ఊపులకు కాయలు రాలునా?
ఉమ్మడి గోర్రె పుచ్చి చచ్చింది
ఉత్తర చూచి ఎత్తర గంప, విశాఖ చూచి విడవర కొంప
ఉల్లి ఉల్లే మల్లి మల్లే
ఉల్లి చేసిన మేలు తల్లీ కూడ చేయదు
ఊరు ఉసిరికాయంత తగువు తాటికాయంత
ఎంత చెట్టుకు అంత గాలి
ఎంత ఎదిగిన గొర్రెకు బెత్తెడు తోకే
ఎంత పండిన కూటికే ఎంత ఉండినా కాటికే
ఎంత పేద్ద గుమ్మడి అయినా కత్తిపీటకు లోకువే
ఎంత తోండం ఉన్న దోమ ఏనుగు కాలేదు
ఎద్దు కొద్ది సేద్యం,సద్ది కోద్ది పయనం
ఎద్దు ఎండకు లాగుతుంది, దున్న నీడకు లాగుతుంది
ఎద్దు పుండు కాకికి ముద్దా?
ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి , గాడిదకేమి తెలుసు గంధపు వాసన
ఎరను చూపి చేపను పట్టినట్లు 
ఏ ఆకు రాలిన ఈతాకు రాలదు
ఎలుక తోలు ఎంత తోమినా నలుపే
ఏనుగు బతికినా వెయ్యి  చచ్చినా వెయ్యి
ఏనుగు మేద దోమ వాలినట్లు
ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు
ఏటికి ఏదురీదినట్లు
ఏ చెట్టూలేని చోట ఆముదపు చేట్టే మహ వృక్షం
ఏ గూటి పక్షి ఆ గూటికే చేరును
ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడు
ఏనుగంత తండ్రికంటే ఏకంత తల్లీ మేలు
ఏనుగులే ఎగిరిపోతుంటే దోమలోక లెక్క?
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుకా?
కలుపు తీస్తె బలుపు
కాచిన చెట్టుకే కర్ర దెబ్బలు
కరవమంటె కప్పకు కోపం విడవమంటె పాముకు కోపం
కర్రలేని వాడిని గొర్రె అయినా కరుస్తుంది
కంచె లేని చేను తల్లి లేని బిడ్డ
కంచే చేను మేస్తె కాపేమి చేస్తాడు
కాకి గూటిలో కోయిల పిల్లలా
కడవంత గుమ్మడి కత్తిపీటకు లోకువ్
కాకిపిల్ల కాకికి ముద్దు
కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు
కాడిని మొసేవాడికే బరువు తెలుస్తుంది
కృషితో నాస్తి దుర్భిక్షం
కొంగ జపం చేపల కోరకు
కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయా
కారుచిచ్చుకు గాడ్పు తోడైనట్లూ
కుంచెడు గింజలకు కూళికి పోతె తూమెడు గింజలు దూడ తినిపోయినట్లు
కూసె గాడిద మేసె గాడిదను చెడగోట్టినట్లు
కుక్కకు పెత్తనమిస్తే చెప్పులన్ని కొరికిందంట
కుక్క తోక వంకర
కుక్కలు చింపిన విస్తరి
కుప్ప తగలపెట్టి పేలాలు వేయించుకున్నట్లు
కోతి పుండు బ్రహ్మరాక్షసి
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటె దూడ గడ్డి కోసం అన్నాడట
గంగిగోవు పాలు గరిటడైన చాలు
గంజాయి తోటలో తులసివలె
గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు
గంధం చెక్క అరిగినా వాసన రాదు
గుడ్డువచ్చి పిల్లను ఎక్కిరించినట్లు
గాలి ఉన్నప్పూడే తూర్పార పట్టాలి
గాదేకింద పందికొక్కువలె
గురువింద తన కింద నలుపెరగదు
గొర్రెలమందలొ తోడేలు పడ్డట్లు
గుర్రం కడుపున గాడిద పుట్టునా?
గుర్రం గుడ్డిదైనా దాణాకేం తక్కువ?
గొర్రె ఏడిస్తే తోడేలుకు విచారమా?
గొర్రెనడిగి గొంతు కోస్తారా?
గుర్రాన్ని నీళ్ళదగ్గరకి తీసుకుపొగలం గాని నీళ్ళు తాగించగలమా?
గొళ్ళెం లేని తలుపు కళ్ళెం లేని గుర్రం
గొడ్డుకో దెబ్బ మనిషికో మాట
గొర్రెని తినేవాడుపొయి బర్రెని తినేవాడు వచినట్లు








నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...