Friday, 9 September 2016

లెక్కలు చేసే కుక్క  


            అతీంద్రియ శక్తులు మానవులకే అనుకుంటున్న రోజుల్లో రష్యా దేశానికి చెందిన వ్లాడిమిర్ డురోవ్ అనే యువకుడు తన పెంపుడు కుక్కతో అద్బుతమైన ప్రదర్శనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతి చెందాడు.

     డురోవ్ బయాలజీలో డిగ్రీ పొంది, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి చివరకు ఒక సర్కస్ కంపనీలొచేరాడు. అందులో ఆటను చేయవలసిన పనల్లా తర్ఫీదు పొందిన ఎలుగుబంట్లు, కుక్కల ఆలనా పాలనా చూడటం, ప్రదర్శన సమయంలో వాటిని జాగార్తగా తీసుకువచ్చి రంగస్థలం మీద ఉండే ఏనిమల్ మాస్టర్కు అప్పగించడం. తను చదువుకు తానూ చేస్తున్న పనికి ఏ మాత్రం సమంధం లేకపోయినా పొట్ట గడవడానికి చేయక తప్పలేదు. సాఫీగా పోతున్న అతని జీవితంలో ఒకరోజు హటాత్తుగా జరిగిన సంగటన అతని జీవితాన్నే మార్చివేసింది.

     ఒక సాయంత్రం మాములుగా ఆటను ఎలుగుబంటిని తీసుకోని రంగస్థలం మీదకు వస్తుండగా, ఉన్నట్లుండి ఆ ఎలుగుబంటి పట్టు తప్పించుకొని, ప్రేక్షకులవైపు లంకించుకుంది. పరేగేట్టుకుంటూ దాన్ని పట్టుకున్న, డురోవ్ మీద తిరగబడి రక్తం కారేలాగా రక్కి పారిపోసాగింది. అయిన సరే విడువక వాళ్ళంతా రక్తం కారుతున్న, ఎలుగుబంటిని పట్టుకొని దాని జూలును రెండు చేతులతో పట్టుకొని దాని మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అంతే ! ఏమి జరిగిందో తెలియదు. కళ్ళు కళ్ళు కలుసుకోగానే అంతవరకూ భీకరంగా పోట్లాడిన ఎలుగు ఒక్కసారిగా తలవంచుకొని డురోవ్ని అనుసరించింది.



           సర్కస్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు, సర్కస్ యాజమాన్యం కూడా డురోవ్ కళ్ళల్లో ఎదో శక్తీ ఉందని గ్రహించారు. అతని మిత్రులు కొందరు తక్షణం ఆ శక్తిని సద్వినియోగ పరుచుకోమని సలహా ఇచ్చారు. అదే రోజు ముహూర్తం పెట్టుకొని డురోవ్ జంతువులపై టేలిపతిప్రయోగాలు మెదలు పెట్టాడు.జంతువులపై అతీతశక్తీ ప్రదర్శించడాన్ని "ఎన్ సై" అంటారు. 

          మార్స్ అనే అల్సేషియన్ కుక్కను పెంచి, దానికి టేలిపతిలో శిక్షణ ఇచ్చాడు.తను కళ్ళతో చూసేసరికి "మార్స్ " అతను చెప్పేది అర్ధం చేసుకొని ఆ పని చేసేది. ఈ వింత, ప్రపంచంలో పారా సైకాలజిస్టులను సైతం సంభ్రమపరిచింది. డురోవ్ ఆ కుక్కతో పాటు మరికొన్ని జంతువులకు కూడా శిక్షణ ఇచ్చి రష్యాలోని మారుమూల ప్రాంతాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చి విశేషమైన కీర్తిని సంపాదించి ప్రభుత్వం ద్వారా " ది ఆర్టిస్ట్ ఆఫ్ సోవియట్ యునియన్ " అనే జతీయ బిరుదును పొందాడు. "ఏనిమల్ దియేటర్ " అనే జంతువులే నటించే నాటకం అతను ప్రదర్శింప చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు.

     ఒక రోజు కొందరు పారా సైకాలజిస్టులు డురోవ్ ఇంటికి వచ్చి తాము ఆ కుక్కను పరిక్షించదలచామని చెప్పారు. సరే అన్నాడు డురోవ్. వారిలో ఒకరు ఒక కాగితం పైన ఎదో వ్రాసి డురోవ్కి ఇచ్చి మార్స్ కి భావ ప్రసారంచేసి చుపమన్నారు. డురోవ్ మార్స్ ని పిలిచి దగ్గరకు తీసుకోని కళ్ళలోకి తీసుకోని తీక్షణంగా ఇరవై సెకన్లు చూశాడు. మరుక్షణం మార్స్ అతన్ని వదిలించుకొని పక్క ఇంటికి పరిగెత్తింది. అది చూసి సైకాలజిస్టులందరూ గట్టిగా నవ్వేసారు. తాము టెలిఫోన్ డైరెక్టరి అడిగామని, అది ఇంటిలో ఉండగా పక్క ఇంటికి పరిగెత్తింది కనుక ఇదంతా మోసం అన్నారు. కానీ ఆ క్షణంలో "మార్స్" నోటిలో టెలిఫోన్ డైరెక్టరి కరుచుకొని పక్కింటి నుండి వచ్చింది. సంగతి విచారిస్తే ఆ డైరెక్టరి ని పక్క ఇంటి వారు అంతకుముందే తీసుకువెళ్లారని తెలిసింది. తరువాత మరో వ్యక్తీ అయిదు మూల్లూ ఎంతోచెప్పించమని  అడిగాడు. డురోవ్ భావ ప్రసారం చేశాడు. మార్స్ అయిదు మూళ్ళు పదిహేను అన్నట్లుగా పదిహేను సార్లు మొరిగి, అలసిపోయి ఒక మూలకు పోయి పడుకుంది.

   డురోవ్ తన జీవితంలో మొత్తం పదిహేను వందల జీవ జంతువులకు టేలిపతి లో శిక్షణ ఇచ్చాడు. అందులో కుక్కలు, ఎలుగులు, ఏనుగులు, పక్షులు చివరికి పాములు కూడా ఉన్నాయి. డురోవ్ 1930 లో  మరణించాడు.






నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...