జరగబోయేది ముందే తెలిస్తే !
కలలు కనటం, అవి
నిజం అవడం లాంటి సంఘటనలు దాదాపు చరిత్ర ప్రారభం అయినప్పటి నుండీ ఉన్నాయి. జరగబోయే సంఘటనలను
ముందుగానే చూడటం, ఎదుర్కోబోయే ప్రమాదాలను గురించి ముందుగానే హెచ్చిరికలు పొందటం వంటి అనుభవాలు దాదాపు ప్రతివ్యక్తి ఎప్పోదో
పొంది ఉంటారనేది నిర్విరాద అంశం.
ప్రసిద్ద మనస్తత్వ శాస్త్రజ్ఞుడు
ఫ్రాయిడ్ ప్రతి కలకు ఆధారం ఉంటుందనీ, సుప్తావస్తలో ప్రతి వ్యక్తి కొన్ని వింత
అనుభవాలకు లోనవుతాడనీ, వాటిని మరునాడు గుర్తు చేసుకొని జాగార్తగా పరిశిలిస్తే తప్పక
దాని అర్ధం విశదం కాగలదనీ, పేర్కొన్నారు.
మార్క్ట్వైన్ అనే అతను మిస్సిసి
నగరంలో నావికాదళంలో పనిచేస్తున్న సమయంలో ఒకనాడు ఒక చిత్రమైన కల కన్నాడు. అందులో తన
సోదరుడు ఒక పడవలో మరణించి ఉన్నట్లు చూశాడు. ఉదయం లేచి అది కేవలం కలే కదా అనుకోని
సరిపెట్టుకున్నాడు. కాని ఆ కల నిజమైంది. కొద్ది రోజులలో అతని సోదరుడు ఆస్మాత్తుగా,
పడవలోనే మరణించాడు. ఇది యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదనీ, తనకిటువంటి అనుభవాలు
చాలా జరిగాయని మార్క్ట్వైన్ పేర్కొన్నాడు.
జర్మనీ చరిత్రను మలుపు
తిప్పిన ప్రముఖుడు బిస్మార్క్కి కూడా కలలపై ఎంతో నమ్మకం ఉంది. తనకు వచ్చిన ప్రతి
స్వప్నం దాదాపు నిజం అయిందని అంటాడు. “థాట్స్ అండ్ మెమోరీస్” అనే పుస్తకంలో తానూ
యుద్దాలలో పొందిన ప్రతి విజయం గురించి ముందుగానే తానూ పొందిన కలల ద్వారా తెలుసుకున్నాని
పేర్కొన్నాడు.
జరగబోయే విషయాలను కలల
ద్వారా ముందుగానే గ్రహించే శక్తినీ “ప్రీ-మానిషన్” అంటారు. అదే ప్రకారంగా జరగబోయే
ప్రమాదాలను ముందుగానే గ్రహించే శక్తిని “ప్రీ-కాగ్నిషన్” అంటారు. శాస్త్రజ్ఞులు.
స్వీడన్ దేశంలో మిసెస్
ఇవా హెల్స్టాన్ పేరు పొందిన పారా సైకాలజిస్ట్. ఆమె కలలపై పరిశోధనలు చేయకపోయినా, ఒక
రోజు ఆమె విచిత్రమైన కల కన్నది. మరునాటి ఉదయమే లేచి కల నిజమో,కాదో అన్నమాట పక్కకు
నెట్టి ఆ కలలో చూసిన దృశ్యాన్ని, వెంటనే ఓ పేపర్పై చిత్రించి తోటి
శాస్త్రజ్ఞులందరికీ చూపించింది. బొమ్మను చూసిన అందరూ ఒకింత ఆశ్చర్యపడినా, అది
అసంభవం అని తేల్చి వేశారు.
ఇంతకు ఆమె పొందిన కల
ఏంటంటే తాము నివసిస్తున్నస్టాక్ హోమ్ నగరంలో తానూ,తన భర్త గాలిలో ఎగురుతూ నగర
నడిబొడ్డు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ చూశారట. ఒక నీలం రంగులో ఉన్నబస్సు,
పచ్చరంగులో ఉన్నఒక లోకల్ ట్రైన్ పెద్ద శబ్దంతో గుద్దుకొని ఎంతోమందికి గాయలుకుడా
తగిలాయంట.
ఆ దృశ్యం యొక్క బొమ్మను
చూసినవారు అందులో బస్సుకూ, ట్రైన్కూ ఉన్నరంగులు గురించి మాట్లాడారు. ఎందుకంటే
అప్పుడు ఆ నగరంలో నీలంరంగు బస్సులుకాని, పచ్చరంగు రైళ్ళుకాని లేవు. పైగా గాలిలో
ఎగరటం వారికినవ్వు కుడా తెప్పించింది.
ఒక సంవత్సరం తరువాత అక్కడున్న
రైళ్లకు పచ్చరంగు వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్నాళ్లకు వివిధ
రంగుల్లో ఉండే బస్సులను ఎకరీతిగా నీలంరంగులు వేయాలని కూడా నిర్ణయించి అది అమలు
చేసారు. మిసెస్ ఈవాకు తన కలలో చూసిన దృశ్యం కొంతమేర నిజమైందని ఎంతో సంతోషించింది.
అంతవరకూ ఈ విషయాన్ని
జాగర్తగా పరిశిలిస్తున్న కొందరు విమర్శకులు కూడా ఈ మార్పులు గమనించి దిగ్భ్రమ
చెందారు. బస్సులకు, రైళ్ళకు రంగులు మార్చటంలో ఆమె ప్రమేయం ఎంతమాత్రం లేదని వారికి
తెలుసు.
సరిగ్గా ఆమెకు కలవచ్చిన
రెండు సంవత్సరాల తరువాత అంటే మార్చి 4, 1956న స్టాక్ హోమ్ నగర
నడిబోడ్డులోనున్న జంక్షన్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది సరిగ్గా మిసెస్ ఈవా
స్వప్నంలో చూసిన జంక్షనే. ఇకపోతే యాక్సిడెంట్ జరిగినది కూడా నిలంరంగులో ఉన్న
బస్సుకు, పచ్చరంగులో ఉన్న రైలుకూ మాత్రమే.
ఈ సంఘటన దేశ ప్రజలందరినీ
ఆశ్చర్యపరిచింది. జరిగిన తరువాత చెప్పి నమ్మించడం కన్నా ముందుగానే తానూ అందరికి
చెప్పటం వలన ప్రజలకు కలలపై ఖచ్చితమైన గురి ఏర్పడింది. ఇది కట్టుకధ కాదు రికార్డడ్
ఫ్యాక్ట్. స్వీడన్ చరిత్రలో లిఖించబడిన యథార్థ సంఘటన.