ప్రముఖుల జీవిత చరిత్రలు ఆసక్తిదాయకాలు. అయితే సుదీర్ఘమైన జీవిత చరిత్రలు చదివే ఓపిక తీరిక ఇప్పుడు చాల మందికి ఉండవు. ప్రసిద్ద వ్యక్తుల జీవిత చరిత్రలోని కోన్ని ఉపఖ్యానాలు, హాస్యొక్తులు, ఆసక్తికరమైన సంఘటనలు మరుపురానివి. అవి వినోదాన్నే కాదు వికాశాన్ని కూడ కలిగిస్తాయి! అలాంటి సంఘటనలు కొన్ని ఇక్కడ చుద్దాము.
భోగరాజు పట్టాభి సీతారామయ్య
ఆంధ్ర నాయకులలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మహామేధావి. అద్భుతమైన జ్ఞాపకశ్క్తి ఆయనిది. వృత్తిరిత్యా డాక్టర్ అయిన పట్టాభిగారు స్వాతంత్ర్యోద్యంలో వృత్తిని వదిలి, గాంధీజీ అనుచర వర్గంలో అగ్రేసరుడు అయ్యాడు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ర్టం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆ మాటకు వస్తే, తెలుగువారికే కాదు, భారతదేశంలో వివిధ భాషలు మాట్లాదేవారికి భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పడాలని ఆయన పోరాడారు.
ఒకసారి కాంగ్రెసు వర్కింగ్ కమిటిలో ఆంధ్ర రాష్ర్టా నిర్మాణావశ్యకతను డాక్ట్రర్ పట్టాభి వివరిస్తున్నారు. " ఉక్కు మనిషి " సర్ధార్ పటేల్, పట్టాభిగారికి అడ్డు తగిలి " పట్టాభి! ఆంధ్ర రాష్ర్టం, ఆంధ్ర రాష్ర్టం అంటావు! ఎక్కడ వుందయ్య నీ ఆంధ్ర రాష్ర్టం. మద్రాసు రాష్ర్టంలో వుండే మీరంతా మద్రాసీలే!" అని ఎకసక్కెంగా అన్నారు.
వెంటనే డాక్టర్ పట్టభి తన జేబులో వున్న ఒక అణాకాసు తీసి, " సర్ధార్ జీ! మీకు తెలుగు ఎక్కడా కనిపించడంలేదా? ఈ అణాకాసులో " ఒక అణా " అని ఇంగ్లీషులో దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీలోను, బెంగాళిలోను, ఆ తరువాత మా తెలుగులో మాత్రమే వ్రాసి వుంది. మీ గుజరాతీ భాష ఈ అణాకాసులో లేదే " అనేసరికి ఆ ఉక్కుమనిషి నిరుత్తురుడైనాడు.
మహాత్మగాందీ మాతృఉభాష కూడ గుజరాతియే! అయినా ఆయన చిరునవ్వు చిందించారు. ఆ రోజులలో రుపాయికి పదహారణాలు. అందువల్ల, ఏ విషయాన్ని అయినా కచ్చితంగా చెప్పవలసి వచ్చినప్పుడు " పదహారణాల ఆంధ్రుడు " " పదహారణాల పచ్చి నిజం " అనేవారు.