Saturday, 29 August 2015

మూడు రుపాయల మునసబు


             ప్రముఖుల జీవిత చరిత్రలు ఆసక్తిదాయకాలు . అయితే సుదీర్ఘమైన జీవీత చరిత్రలు చదివే ఓపిక , తీరిక ఇప్పుడు చాలమందికి ఉండవు. ప్రసిద్ద వ్యక్తుల జీవిత చరిత్రలోని కొన్ని ఉపాఖ్యానాలు , హాస్యోక్తులు , ఆసక్తికరమైన సంఘటనలు మరుపురానివి . అవి వినోదాన్నే కాదు వికాసాన్ని కూడ కలిగిస్తాయి ! అలాంటి సంఘటనలు కొన్ని ఇక్కడ మనం చూద్దాము.

   టంగుటూరి ప్రకాశం పంతులు 

           " ఆంధ్రకేసరి " టంగుటూరి ప్రకాశంగారి ధైర్యసాహసాలు, నిర్బ్జయత్వం, త్యాగనిరతి, దేశభక్తి యావదాంధ్రులకే కాదు, యవద్భారతానికీ తెలిసినవే. ప్రకాశంగారు గొప్ప ప్లీడరు. కొంతకాలం ప్లీడరుగా రాజమండ్రిలో ప్రాక్టీసు చేసిన తరువాత లండన్‌ వెళ్ళి బారిష్టరు ప్యాసై వచ్చారు.

          అంతకు పూర్వం ఒకసారి రాజమండ్రిలో మునసబు కోర్టుకు ఆయన ఎదో వాదించడం కోసం కూర్చున్నారు. ఒక కేసులో నిందితుడు తాను ప్లీడరను పెట్టుకొలేనని, పేదవాడినైన తనకు ప్లీడర్లకు పెద్ద ఫీజులిచ్చే తాహతులేదని విన్నవించుకున్నాడు.







           వెంటనే ఆ మునసబుగారు " రాజమండ్రిలో ప్లీడర్ల కేమిలోటు? వీధికి ముగ్గురు ప్లీడర్లున్నరు, రెండు, మూడు రుపాయలిస్తే ప్లీడరు వస్తాడు!" అని సలహా ఇచ్చాడు!
         ఇది వినం ప్రకాశంగారికి ఆగ్రహం కలిగింది. రాజమండ్రి ప్లీడర్లను అవమానించిన ఆ మునసబుగారికి బుద్ది చెప్పాలని " అయ్యా! ఇప్పుడు రెండు, మూడు రూపాయలకు వచ్చే ప్లీడర్లు రాజమండ్రిలో లేరు. అలాంటి ప్లీడర్లందరు మునసబు ఉద్యోగాలకు వెళ్ళిపొయారు!" అని ప్రకాశంగారు అనేసరికి  ఆ మునసబుగారి ముఖం సిగ్గుతో ఎర్రబడింది! ఆయన కూడా ఒకప్పుడు ప్లీడరే కదా!

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...