Wednesday, 26 August 2015

మీకు తెలుసా ?

   

                ప్రముఖుల జీవిత చరిత్రలు ఆసక్తిదాయకాలు. అయితే సుదీర్ఘమైన జీవీత చరిత్రలు చదివే ఓపిక , తీరిక ఇప్పుడు చాలమందికి ఉండవు. ప్రసిద్ద వ్యక్తుల జీవిత చరిత్రలోని కొన్ని ఉపాఖ్యానాలు , హాస్యోక్తులు ,ఆసక్తికరమైన సంఘటనలు మరుపురానివి . అవి వినోదాన్నే కాదు వికాసాన్ని కూడ కలిగిస్తాయి! అలాంటి సంఘటనలు కొన్ని ఇక్కడ మనం చూద్దాము.



                                                                   గాంధీజీ
   
       రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తన ఆత్మబలంతో , సత్యాహింసలతో ఆయుధాలతో ఎదిరించి, గెలిచిన మహాత్మగాంధీ చిన్నప్పుడు వట్టి పిరికి. నలుగురితో మట్లాడాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బిడియపడేవాడు . రాజ్ కోట హైస్కూలులో విద్యాభ్యాసానంతరం బారిష్టరీ చదవడానికి లండను వెలుతున్న గాంధీజీకి ఉపాధ్యాయులు , విద్యార్ధులు వీడ్కోలు సభ జరిపారు .లండను  క్షేమంగా వెళ్లీ లాభంగా రమ్మని ఉపాధ్యాయులు , విద్యార్ధి నాయకులు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత వీడ్కోలు సన్మానానికి జవాబు చెప్పవలిసిందిగా గాంధీజీని ప్రధానోపాధ్యాయుడు ఆదేశించాడు.



                    సమాధానం అనేసరికి గంధీగారు గడగడ వణకడం ప్రారంభించారు.గుండెలు కొట్టుకోసాగాయి. అంతకు పూర్వం ఆయన బహిరంగ సభలో ఎప్పూడూ మాట్లాడి ఎరగరు. అందువల్ల, " నేను మాట్లాడలే " నని ఆయన చేతితో సైగ చేసి కూర్చునారు. తోటి విద్యార్ధులందరు గొల్లుమన్నారు! తరువాత బారీష్టరీ ప్యాసయి  వచ్చిన గాంధీజీకి దక్షిణాఫ్రికాలోని ఒక కోర్టులో తన తరుపున వాదించడానికి అబ్ధుల్లా అనే క్లయింటు వకాల్తా ఇచ్చాడు.

                         కోర్టులోఉన్న ప్లీడర్లను, క్లయింట్లను , జడ్జీని చూచేసరికి గాంధీజీకి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ముచ్చెమటలు పొశాయి. నోటమాట రాలేదు.తాను కోర్టులో వాధించలేనని గంధీజీ భావించి, " నాకు ఈ వకాల్తా వద్దు , ఫీజు వద్దని " ఆ ఫైలును బల్లమీద కొట్టి కోర్టునుండి వెళ్లిపొయారు.
       
         అలా పదిమందిలో నోరు తెరవడానికి గడగడలాడిపోయిన గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో్ పాల్గోన్న తరువాత , లక్షలాదిమంది పాల్గోన్న వేలాది సభలలో అనర్గళమహోపన్యాసాలు చేశారు.తన వచో విభవంతో లక్షాలాది భారతీయులను ప్రభావితం చేశారు; వారిలో స్వాతంత్ర్యాగ్ని రగుల్కోలిపారు! ఆశ్చర్యం! తనకు జరిగిన సత్కారానికి నాలుగు మాటలైన చెప్పలేని ఆయన 1947 మార్చిలో ఢిల్లిలో జరిగిన అఖిలాసియా రజ్యాల మహాసభలో చేసిన మహోపన్యసాన్ని విన్న వివిధ దేశాల ప్రతినిధులు ఆయనకు " మహా ప్రవక్త " అని ప్రస్తుతించారు.

                           ఆత్మ విశ్వాశంతో, దీక్షతో, పట్టుదలతో , సాదించలేనిది లేదని, సభా పిరికి అయినా సభా కేసరి కావచ్చుననడానికి మహాత్మగాంధి జీవితంలోని ఈ రెండు సంఘటనలు మరుపురానివి.

No comments:

Post a Comment

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...