"ఆగష్టు 15" తెర వెనుక గాధ
మన స్వాతంత్ర ప్రదానానికి ఆగస్టు 15వ తేదిని ఎవరు నిర్ణయించారు? బ్రిటిష్ ప్రభుత్వమా? కాదు భారత జాతీయ నాయకులా? కాదు. మరెవరు?
ఆనాటి ఇండియా ఆఖరు వైస్రాయి లార్డ్ మౌంట్
బాటెన్! 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని క్టేమంట్ఆట్లి 1948 జూన్ లోగా ఇండియా నుండి బ్రిటిష్ సైన్యాలు
వైదోలగుతాయని, ఈలోగా
భారతదేశానికి స్వాతంత్ర్య ప్రధానం జరుగుతుందని ప్రకటించాడు కాని, స్వాతంత్ర్య ప్రదానం తేదీని మాత్రం
ప్రకటించలేదు.
కాగా, 1947 మే నెలలో వైస్రాయి మౌంట్ బాటెన్ పత్రికా
విలేకరుల గోష్టి ఏర్పాటు చేసినప్పుడు ఇండియాకు స్వాతంత్య్రం ఏ రోజున ఇస్తారని ఒక
విలేకరి ప్రశ్నించాడు. మౌంట్ బాటెన్ కొంచెంసేపు ఆలోచించి "ఆగస్ట్ 15 " అని ప్రకటించాడు. ఆగస్ట్ 15కు ప్రతేకత ఏమిటి. అంటే పూర్వం అడ్మిరల్ మౌంట్
బాటెన్ ఆగ్నేయాసియాలో మిత్ర రాజ్యలా సర్వసేనానిగా ఉన్నప్పుడు ఆగస్ట్ 15న జపాన్ సేనలు ఆయనకు లొంగిపోయాయి. ఆయనకు ఆగస్ట్ 15 జయప్రదమైన రోజు కాబట్టి, ఆ రోజును ఆయన ప్రకటించాడు!
అయితే, జోస్యాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదుకాని,
కలకత్తాకు చెందిన
ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్రవేత్త స్వామి మదనానంద అప్పుడే లార్డ్ మౌంట్ బాటెన్ కు
లేఖ వ్రాస్తూ ఆగస్ట్ 15 ఇండియాకు మంచిది
కాదని, ఆరోజు స్వాతంత్ర్యం
ప్రదానం చేస్తే, భారతదేశానికి
కరువు కాటకాలు, మత కల్లోలాలు
తప్పవని హెచ్చరించారట. అయితే, అది మూడ
విశ్వాసమని త్రోసిపుచ్చి, ప్రధాని కానున్న
పండిట్ నెహ్రు కూడా మౌంట్ బాటెన్ నిర్ణయాన్ని బలపరిచారట. అది ఆగస్ట్ 15 కధ!