Tuesday, 1 September 2015

గొర్రెల కాపరి పెంచిన చీఫ్ జస్టీస్

మెహర్ చంద్ మహాజన్‌

          మూఢ విశ్వాసాలు ఎంత దుష్పరిమాణాలకైనా దారి తీస్తాయి. మనం పూర్వం కాశీ మజలీల్ కధల్లో చదివి వుంటాం. ఒక రాకుమారుడు కాని, రాకుమార్తెకాని పుట్టగానే వారి వల్ల తల్లి దండ్రులకు కీడు వాటిల్లుతుందని, మరణం తప్పదని ఏ జ్యోతీష్కుడో మిడిమిడి జ్ఞానంతో చెబుతాడు. ఆ దెబ్బతో బయపడిన తండ్రి తల్లికి మాతృ ప్రేమ వల్ల ఇష్టం లేకపోయినా ఆ పసికందును ఏ అడవిలోనో వదిలిపెట్టడం జరుగుతుంది!

         అల్లంటి సంఘటన ఇటీవల కూడా నిజంగా జరిగింది. ఆ బిడ్ద పుట్టగానే తల్లిదండ్రుల పుట్టి మునుగుతుందని జోతిష్కుడు చెప్పిన మాట విని, పుత్ర ప్రేమని కూడ చంపుకుని, ఆ తల్లిదండ్రులు, అతడిని నిర్ధాక్షిణ్యంగా ఒక కొండపై వదిలి పెట్టారు. 




            

               ఆ బిడ్డను ఒక గొర్రెల కాపరి చూచి, పెంచి పెద్ద చేశాడు. విద్యాబుద్దులు చెప్పించాడు. అతడు ఆ తర్వాత కాశ్మీర్ ప్రధాని అయ్యాడు. ఆయన హయాం లోనే కాశ్మీర్ ఇండియాలో విలీనమైంది. అది 1947 అక్టోబర్ మాట. ఆ తరువాత అతడే మన సుప్రీంకోర్టు జడ్జీ అయినాడు. అటు పిమ్మట ఆ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినాడు.

ఆయన పేరు? మెహర్ చంద్ మహాజన్‌! ఇది కాశీ మజిలీ కదలా వుంది కదూ! కాదు అక్షరాల వాస్తవగాథ. 

No comments:

Post a Comment

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...