Sunday, 11 September 2016

ప్రాణం తీసిన కల

          

           మిస్ బెర్తా చాల అందగత్తె. వెర్మాంట్ పట్టణంలో ఆమె అందాన్ని గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ వూళ్ళో ప్రతి క్లబ్బు ఆమె కోసం అర్రులు చాస్తుంది. ఆమె పాల్గొన్నదంటే విందు వినోదాల విలువ హెచ్చుతుంది. కాసేపైన వచ్చి వెళ్ళమని ఆమెను ఆమె స్నేహితులు పార్టీలకు పిలుస్తుండటం నిత్యకృత్యమైంది.

         మిస్ బెర్తా ఒక రాత్రి ఎదో పార్టీకి వెళ్ళగా బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంది. పొద్దున్నా పదియినా గదినుండి బయటకు రాలేదు. ఇంతసేపు పడుకోవటం ఏంటని తల్లి కోప్పడటానికి గదిలోనికి వెళ్ళింది.కాని ఆశ్చర్యం ! మిస్ బెర్తా ఆ గదిలో లేదు. బాత్ రూమ్తో సహా ఇల్లంతా గాలించింది. పోనీ పొద్దున్నే లేచి ఏ స్నేహితుల ఇళ్ళకు వేల్లిందేమో అని అనుకుంటే అది లేదు. ఆమె బాయ్ ప్రెండ్స్ తమకు తెలియదంటే తమకు తెలియదన్నారు. అనుమానం వచ్చి చుట్టుపక్కల బావులూ, చెరువులు వెతికించింది. కానీ, ప్రయోజన శూన్యం. మూడురోజులపాటు వెతికి వెతికి వేసారిపోయింది. పొలిసు రిపోర్ట్ ఇచ్చారు. చుట్టపక్కల ఉళ్ళకు, మనుషులను పంపిచారు. వారం రోజులైంది అప్పటికే మిస్ బెర్తా జాడ తెలియనేలేదు.



        మిసెస్ టైటాస్ వేర్మాండ్ పట్టణంలో ఒక సామాన్య స్త్రీ.  ఆమె సామాన్య స్త్రీయే కానీ, ఆదసారణ ప్రతిభ ఆమెకు ఒకటున్నది. ఏదైనా ఒక సమస్యను తలుచుకొని నిద్రపోతే, కలలో ఆ విషయానికి సంబంధించిన సమాచారం ఆమెకు తెలుస్తుంది. ఒక రాత్రి బెర్తా గురించి అనుకోని పడుకుందట. కలలో ఆమెకు బెర్తా గురించి భయంకర విషయం తెలిసింది. మరునాడు ఉదయం పాపం పని కట్టుకొని ఆమె బెర్తా ఇంటికి వెళ్ళింది. బెర్తా తల్లిని కలుసుకొని ఆ ఊళ్ళోని షాకీర్ బ్రిడ్జి కింద నీటి మడుగున బాగా వెతికించమని సలహా ఇచ్చింది. నీటిలో బెర్తా శవం కుళ్లిపోయి ఉన్నట్లు మిసెస్ టైటాస్ కలలో కనిపించింది. నమ్మకం కలగపోయినప్పటికీ నలుగురు ఈతగాళ్ళు బ్రిడ్జి క్రిందినిటిలో చూశారు. శవం కనిపించలేదు. బెర్తా బందువులు ఇదంతా "నాన్సెన్" అన్నారు.

       మిసెస్ టైటాస్ ఆ రాత్రి మళ్ళా కలగన్నది. మరునాడు మళ్ళి బెర్తా తల్లివద్దకు వెళ్లి బ్రిడ్జి క్రింద మళ్లి వెతికించమనీ, బెర్తా శవం బురదలో బాగా లోతుకు కూరుకు పోయి ఉన్నదని చెప్పింది. ఈతగాళ్ళు మళ్ళి సరస్సులో దిగి లోతుకు వెళ్లి వెతికారు. ఈసారి కుళ్ళి శిధిలమైపోయిన బెర్తా శవం దొరికింది. గుర్తుపట్టటానికి వీలులేని స్థితిలో ఉన్నప్పటికీ, అది బెర్తా శవమే అని నిర్థారణ అయ్యింది.

      బెర్తా శవమైతే దొరికింది కాని, కొత్త పేచి వచ్చింది. శవం ఫలానా చోట ఉన్నదని టైటాస్ చెప్పింది కనుక, టైటాస్ హత్యచేసి ఉండాలని చాలామంది యువకులకు అనిపించింది. కలలో ఇలాంటి సమాచారం తెలిసిందిని టైటాస్ చెప్పడం పచ్చిమోసం, దగా అన్నారు వారంతా ముక్తకంటంతో.

      యువకుల ఆవేశం కట్టలుతెంచుకుంది. అందరూ వెళ్లి టైటాస్ ఇంటి మీదపడ్డారు. ఆమెను పట్టుకొని చితకోట్టారు. ఇంటికి నిప్పు అంటించారు. కానీ ప్రాణాలతో మిగిలిన టైటాస్ ఆసుపత్రి లో చేర్చారు. టైటాస్ ఇంకా కొద్ది సేపటిలో మరణిస్తుంది అనగా బెర్తా మరణ రహస్యం బయటపడింది. పీటర్ అనే యువకుడు బెర్తా ను అర్థరాత్రి తీసుకువెళ్ళి పీక నులిమి బ్రిడ్జిపై నుండి నీళ్ళలోనికి తోసివేసాడట. పాపం బెర్తా మరనోదంతాన్ని అయితే తెలిసుకుంది కానీ, టైటాస్ తనకు కలుగుతున్న ముప్పును గుర్తించలేకపోయింది. పీటర్ తన చేసిన నేరాన్ని పోలీసులకు చెప్పాడు. బెర్తాను ఎలా హత్య చేసింది వివరించాడు. కాని టైటాస్ ప్రాణాలు విడిచింది.

సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్   

No comments:

Post a Comment

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...