అబ్రహం లింకన్
కొందరికి చిన్న పదవో, ఉద్యోగమో వస్తే చాలు, అధికారదర్పమతో మిడిసి పడతారు. పెద్ద మనుసున్నవారు, ఎంత పెద్ద పదవి వచ్చినా, ఏ హోదా వచ్చినా, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు.
ఒకసారి అమెరికా అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక స్నేహితుడితో కలిసి గుర్రపు బుగ్గీపై వెడుతున్నాడు. దారిలో ఓ నీగ్రో ఎదురుపడ్డాడు. అతడి బట్టలు మాసిపోయి వున్నాయి; టోపి చినిగిపోయింది.
మనిషే దుమ్ముకొట్టుకోని
వున్నాడు.
దేశాధ్యక్షుని చూడగానే ఆ నీగ్రో తన టోపీతీసి శాల్యట్ చేశాడు. వెంటనే అబ్రహంలింకన్ గుర్రపు బగ్గిలో లేచి నిలబడి, తన టోపితీసి ఆ నీగ్రోకు ప్రత్యభివాదం చేశాడు.
ఇది చూచిన ఆయన మిత్రుడు " అదమిటీ, అబ్రహం! ఆ ముసలీ నీగ్రోకు లేచి నిలబడి టోపి తీసి మరీ శాల్యూట్ చేశావ్? అతనెక్కడ? నీ వెక్కడ? నీవు ఆ మహా దేశానికి ప్రసిడెంట్వి. అతడు నికృష్టపు నీగ్రోవాడు!" అనగానే అబ్రహం లింకన్ " మిత్రమా! మర్యాదలో నాకంటె ఎవ్వరూ అధికంగా వుండరాదన్నది నా వుద్దే్శం. ఆ నిగ్రో అభివాదానికి నేను ప్రత్యభివాదం చేయకపోతే, నా కంటె అతడే మర్యాదస్తుడు, సంస్కారవంతుడవుతాడు. ఒక దేశాధ్యక్షుని కంటె ఒక సామాన్య పౌరుడు సంస్కారవంతుడనిపించూకుంటే, అది ఆ అధ్యక్షునికి ఏమి గౌరవం? ఆ దేశానికి ఏమి గౌరవం?" అనే సరికి ఆ మిత్రుడు తన దేశాధ్యక్షుని నిరాడంబరత్వానికి, సౌజన్యానికి అబ్బురపడ్డాడు!
అలాంటి మర్యాద మన్ననలు మన పరిపాలకులలో ఎందరికున్నాయి?
No comments:
Post a Comment