పటౌడీ నవాబ్
మనం బ్రిటీష్ వారి పాలనలో వున్నప్పుడు మనలో కొందరు బ్రిటన్ వెళ్ళినా,ఇక్కడ వున్న ఇంగ్లీష్ వారయినా భారతీయులను చులకనగా చూచేవారు; వీలుదొరికినప్పుడల్లా భారతీయులను వెక్కిరించేవారు.
అప్పటిలొ విదేశాలలొ ఆడే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో భారతీయ ఆటగాళ్ళకు అవకాశం లభించేది కాదు. మనది అప్పట్లో బ్రిటీష్ వలస
అయితే, ఆప్పటిలో ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు పటౌడీ నవాబ్ సీనియర్కు ఆస్ట్రేలియాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లీష్ టీం లో ఆడే అవకాశం వచ్చింది. అది 1932 వ సంవత్సరం.
సిడ్ని గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ ప్రారభమైంది. ఇంగ్లీష్ టీం కెప్టన్ గ్రౌండ్ లోకి రాగానే ఇంగ్లీష్ వారు, ఆస్ట్రేలియన్లు తెల్లవారే కాబట్టి, ఆయనను చూచి హర్షాదానాలు చేశారు. కొంతసేపు తరువాత పటౌడి వచ్చి, బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆయన నెమ్మదిగా పరుగులు చేస్తున్నాడు.
అప్పటిలో గాంధీగారు మేక పాలు త్రాగి జీవిస్తున్నారని దేశవిదేశాలలో అందరికి తెలుసు.పాశ్చాత్యులు కొందరికి అది హేళనగా వుండేది,
గాంధీగారి దేశంనుంచి వచ్చిన పటౌడిని ఆటలు పట్టిద్దామని ఒక ఆస్ట్రేలియన్ అనుకున్నాడు. సాదారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు కేకలు, అరుపులు, నినాదాలు సహజమే.
ఆ ఆస్ట్రేలియన్ " హే గాంధీ! నీ మేక ఎక్కడ? " అని మేక గొంతుతో అరిచాడు. ప్రేక్షకులందరూ ఒక్కసారి దిగ్భ్రాంతి చెందారు. అతడు అలా ఎందుకు అరవవలసి వచ్చిందో వారికి అర్ధం కాలేదు.
అయితే, పటౌడీ బెంబేలు పడలేదు. వెంటనే " ఓ నా మేక! నువ్విక్కడ వున్నావ? " అంటూ ఆ కేక వినిపించినవైపు
తన వేలు చూపుతూ " అయ్యా! ఇక్కడ ఎవరైన నాకొక తాదు ఇస్తారా? నా మేకను కట్టి తోలుకుపోతాను! " అని అరిచేసరికి అంతమంది ప్రేక్షకులూ గొల్లున నవ్వారు! ఆ మానవ రూపంలో వున్న మేక అక్కడినుండి నెమ్మదిగా వుడాయించింది.
No comments:
Post a Comment