బాలగంగాధర్ తిలక్
జులై 23వ తేది " లోకమాన్య " బాలగంగాధర తిలక్ జన్మదినోత్సవం. తిలక్ మహారాజ్ మహారాజ్ మన స్వాతంత్రోద్యమ చరిత్రలొ మరుపురాని-మరువలేని పేరు.
ఆయన మహాత్మ్గాంధీకి గురుతుల్యుడు. తిలక్ మరణిస్తూ తన తరువాత గాంధీజీయే స్వాతంత్రోద్యమ నాయకుడని ప్రకటించారు. ఆయన మరణానంతరం గాంధీజీ భారత స్వాతంత్రోద్యమ సర్వసేనాని అయ్యారు.
"స్వాతంత్రం నా జన్మహక్కు " దాన్ని నేను సాధించి తీరుతానని బ్రిటీష్ ప్రభుత్వంపై స్వాతంత్ర సమర శంఖారావం పూరించిన ఆయనకు అన్యాయాన్ని ఎదిరించటం అనేది ఉగ్గుపాలతో పెట్టిన విద్య.
చిన్నప్పుడు తిలక్ పాఠశాలలో చదువుతుండగా ఒక ఆశక్తికరమైన సంఘటన జరిగింది. క్లాసురూమ్లో ఎవరో పిల్లలు కాగితాలు చించి, చిందర వందరగా పోశారు.
ఇది ఉపా్ధ్యాయుడు చూచి, ఉగ్రుడైనాడు. అలా చేచింది ఎవరని అడిగితే, ఎరూ సమాధానం ఇవ్వలేదు. ఎందువల్లనంటే, ఆ పని చేసింది ఒక రౌదీ కుర్రవాడు. అతని పేరు చెబితే తరువాత తమకు మూడుతుందనని భయపడిన విధ్యార్ధులు కిమ్మనకుండా ఊరుకుకున్నారు. ఉపాధ్యాయునికి మరింత కోపం వచ్చి, ఆ కాగితాలన్ని బయ పారవేసి, గదిని శుభ్రం చేయవలిసిందిగా విధ్యార్ధులకు ఆదేశించాడు. పిల్లలందరూ గడగడలాడుతూ గదిని శుభ్రం చేస్తున్నారు. కాని ఒక్క కుర్రవాడు మాత్రం వూడ్చడం లేదు.
" నీవెందుకు గదిని శుభ్రం చేయటం లేదు " అని ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడిని గద్దించాడు.
"నేను కాగితాలు చించలేదు. చించింది ఎవరోకూడ నాకు తెలియదు. అలాంటప్పుడు, చేయని తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఎవరో తప్పు చేశారని అందరినీ దండించడం అన్యాయం కాదా? " అని తిలక్ నదురూ , బెదురూ లేకుండా సమాధానమిచ్చాడు. ఆ జవాబు మాస్టారుకు నచ్చలేదు. బెత్తం తీసుకుని తిలక్ ను చితక బాదాడు. వళ్ళు వాచేటట్టు దెబ్బలెన్నన్న తిన్నాడు గాని, ఆ బాలుడు గది వూడ్చడానికి మాత్రం ససేమిరా అంగీకరించలేదు.
ఈ సంగతి తిలక్ తండ్రి రామాచంద్ర తిలక్ కు తెలిసింది. తన కుమారుని న్యాయదృష్టికి, స్వతంత్ర ప్రవృత్తికి, నిర్భీకత్వానికి ఆయన ఎంతో సంతోషించాడు. ఒకనాటికి ఆ కుర్రవాడే పెద్దయిన తరువాత మహానాయకుడై రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని ఎదిరించి లోకమాన్యుడవుతాడని ఆ తండ్రి ఆనాడు వూహించగలితే ఇంకెంత సంతోషించి వుండేవాడో!
No comments:
Post a Comment