ఆచార్య జె.బి. కృపలానీ
ఆనాటి
నాయకులలొ హాస్య చతురత ఎక్కువ
వుండేది వారిలో కొందరు ఇతరులపై చురకలు వేయడమే కాదు, తమపై విసుర్లు
విసిరినా హాయిగా నవ్వుకునేవారు.
ఆచార్య
జె.బి. కృపలానీ ప్రముఖ
గాంధేయవాది మహత్మగాంధికి అనుంగ శిష్యుడు. ఆయన
కాంగ్రెస్ మాహాసంస్థకు 12 సంవత్సరాలుపాటు సెక్రటరిగా పని చేసి
" సక్సస్ఫుల్ సెక్రటరీ " గా
పేరు తెచ్చుకున్నారు.
1951లో ఆయన
కాంగ్రెస్ ను దిలిపెట్టి ప్రతిపక్షం
లో చేరారు. కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించేవారు.
అయితే, ఆయన భార్య సుజాతకృపలానీ
మాత్రం ఆయనతో ఏకభవించకుండా, కాంగ్రెస్లొ చేరి ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రిణి అయ్యారు. అప్పటికి మన దేశంలో ఒక
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ
ఆమె.
ఒక
రోజున ఆచార్య కృపలానీ లోక్సభలో ప్రభుత్వ
పక్షమైన కాంగ్రెస్ను తీవ్రంగా విమర్సిస్తున్నారు.
వెంటనే
ఒక కాంగ్రెస్ సభ్యుడు లేచి, " అయ్యా! కృపలానీగారూ! మీరేమో కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. మీ భార్యమో
మీ మాటకాదని మా పా పార్టిలోచేరి
ముఖ్యమంత్రి అయ్యారు. మీ మాట మీ
భార్యే వినటంలేదు! మమ్మల్ని ఎలా వినమంటారు? " అని
అవహేళనగా అన్నాడు.
ఎదుటి
వారికి తడుముకుండా సమాధానం చెప్పే కృపలానీ లేచి ఇలా అన్నారు:
" మిత్రమా ఇంతవరకు
కాంగ్రెస్వారు వట్టి మూర్ఖులే
అనుకున్నాను. ఇప్పుడు ఇతరుల భార్యలను కూడా
లేవదీసుకు వెళ్ళే రౌడీలని తెలుసుకున్నాను. " -- అని
అనేసరికి అన్ని పక్షాల సభ్యులు
గొల్లుమన్నారు!
అప్పటిలో
విమర్శలు అలా వ్యంగ్యోక్తులతో, హాస్యోక్తులతో
వుండేవి!
No comments:
Post a Comment