లివిటేషన్(గాలిలో ఎగరటం)
యోగశక్తితో వాయుస్తంభన, అగ్నిస్తంభన, జలస్తంభన వంటి అసాధరనా విద్యలను అవలీలగా
ప్రదర్శించవచ్చని మనం విన్నాం,చదువుకున్నాం. కానీ ఎటువంటి శక్తి, సాధన లేకుండా
కూడా వ్యక్తులు గాలిలో ఎగరటం సాధ్యమేనని న్యూయార్క్ లోని పారా సైకాలజీ లేబరేటరీ
శాస్ర్తజ్ఞులు ధృవీకరించారు. ఇది సాధన చేయకుండానే కొందరికి స్వతస్సిద్దంగా
అబ్బుతుందని కుడా అన్నారు. 1973లో ఇంగోస్వాన్ అనే శాస్ర్తజ్ఞునిపై ఎన్నో ప్రయోగాలు
చేసి, మనిషి గాలిలో ఎగరటం(లివిటేషన్) సాధ్యమే అన్నారు.
లండన్లో కోలిన్ ఇవాన్స్ అనే వ్యక్తికీ ఈ శక్తి ఉన్నట్టు విచిత్ర పరిస్థితిలలో
వెల్లడైంది. అది అతని జీవితాన్నే మార్చివేసింది. అతను విద్యార్ధిగా ఉన్న రోజుల్లలో
స్కూలలో చాలా అల్లరి చేసేవాడు. ఒకరోజు కొందరు విద్యార్థులు స్కూలు ప్రక్కనే వున్న
ఒక భూస్వామి ఇంట్లో జామకాయలు దొంగతనంగా కోసుకోడానికి వెళ్ళారు. జామచెట్టు ఇంటి
ఆవరణలో ఉంది, ఒక కొమ్మ మాత్రమె బయటికి ఉండేది. దాని నిండా కాయలే. అయితే ఆ కాయలు
పిల్లలకు అందే ఎత్తులో లేవు. అప్పుడు ఇవాన్స్ తన స్నేహితులతో ఒకరిని వంగమని చెప్పి,
వాని నడ్డిమీద నుంచొని, బలం తీసుకోని ఒక్కసారి జామ కొమ్మ అందుకుందామని ఎగిరాడు
అంతే! ఎగిరినవాడు అలా గాలిలో ఎటువంటి ఆసరా లేకుండా ఎత్తున ఉండిపోయాడు. అది చూసిన
మిగతా పిల్లలు బెజారేత్తిపోయి ఇవాన్స్ ను ఏదైనా దెయ్యం పట్టిందేమో అని వెనక్కి
చూడకుండా ఇంటికి పరుగు లంఖించుకున్నారు.
ఈ హటాత్సంఘటనకు ఇవాన్స్ కూడా బెంబేలెత్తిపోయి అరవటం మొదలుపెట్టాడు. అలా ఒక
నిముషం ఉన్న తరువాత మెల్లగా క్రిందికి చేరాడు. ఇంటికిపోయి చెప్తే ఇంట్లో ఎవరు
నమ్మలేదు. కావాలంటే మళ్ళి ప్రయత్నిస్తానని చెప్పి ఇవాన్స్ ఒక కుర్చిపై నుంచి
ఎగిరాడు. చిత్రం! అతను అలాగే మళ్ళి గాలిలో ఉండి ఒక నిముషం తరువాత దిగిడాడు. ఈసారి
ఇవాన్స్ భయపడలేదు. తప్పక క్రిందకు దిగుతానని అతనికి కలిగింది. బంధువుల కొరకు
అయితేనేం ప్రతిరోజూ ఈ విద్యను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు.
ఈ అద్భుతం విన్న స్టీవెన్ అనే సర్కస్ కంపనీ యజమాని ఇవాన్స్ తల్లిదండ్రులను
సంప్రదించి, తానూ ఇవాన్స్ మంచి చెడ్డలు చూసుకుంటూ బాగా చదివిస్తాననీ, సాయంత్రం సమయాలలో
మాత్రం అతనిచేత ‘లివిటేషన్’ ప్రదర్శనలు చేయిస్తాననీ, దానికి ప్రతి ఫలంగా కొంత
సొమ్మును ముట్టచేప్తాననీ చెప్పి తీసుకువెళ్ళాడు.
ఆ రోజు నుండి ఇవాన్స్ కు సిరి ఎత్తుకుంది. సర్కస్ లో మిగతా అంశాలకన్నా లివిటేషన్ మాత్రమే ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేది.
సర్కస్ కంపనీతో పాటు తానూ కూడా చాలినంత ధనం సంపాదించుకున్న తర్వాత ఇవాన్స్ బయటికి
వచ్చి ప్రసాంతమైన జీవితం గడపసాగాడు.
ఒకసారి కొందరు హేతువాతులూ, డాక్టర్లు, హిప్నాటిస్ట్ లూ, జర్ననిస్ట్ లూ ఇవాన్స్
ను పరిక్షచేయదలచి(1938 లో) లండన్ లోని ’కాన్ వే’ హాలులో అతని ప్రదర్శన ఏర్పాటు
చేసారు. మాజిక్ తెలిసినవారు అతని శరీరం పై అయస్కాంతానికి సంభందించిన పరికరాలేమైన
ఉన్నాయోమోనని పరిక్ష చేసారు. అందరి పరిక్షలు ఐన తర్వాత ఇవాన్స్ ఒక్కసారి గాలి
పీల్చి చూస్తుండగానే ఎగిరి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. ఒక నిముషం తరువాత
క్రిందకి దిగి తిరిగి తన శరీరాన్ని అందరూ పరిక్షచేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు.
దేముడు, దెయ్యం అనకుండా, కేవలం తనకు తెలియని ఒక అద్భుత శక్తి వలన అసాదారణమైన
ఈ పని చేయగలుగుతున్నాననీ, తానూ ఎప్పుడైనా పరీక్షకు సిద్దమని ప్రకటించాడు.
ఇటువంటి అసాధారణ విద్యలను ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తమ ఇష్టం వచ్చినప్పుడు
ప్రదర్శించిన మహాత్ములు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అది వారికి పుట్టుకనునుండి
వచ్చి ఉండవచ్చు. లేదా అభ్యాసం వల్ల వచ్చి ఉండవచ్చు. మాయలు మంత్రాలు లేకుండా ఇటువంటి
శక్తులను ప్రదర్చించ వచ్చని రష్యా, బల్గేరియా దేశాలు కూడా ఒప్పుకున్నాయి. దానికి
సంబంధించిన లేబరేటరీలు కూడా అక్కడ వెలిసాయి.
ఇంగ్లాండుకు చెందిన సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డేనియల్ డగ్లస్ హోమ్ ‘లివిటేషన్’
లో అందవేసిన చేయి. ఒక సారి పుర ప్రముఖులు, విజ్ఞుల సమావేశంలో తాను గాలిలో ఎగిరి,
అలా తేలుతూ ఒక కిటికిలోనుండి మరొక కిటికీలో నుండి లోపలికి వచ్చాడు.
సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్
No comments:
Post a Comment