నిజం చెప్పిన కల
జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడుకు మార్షల్ ని వెంటపెట్టుకొని పొలానికి పోయి, తిరిగి చీకటి పడ్డాకా తిరిగి ఇంటికి రావటం తన దినచర్య. ఎక్కువ సమయం మార్షల్తో గడపడం వలన తండ్రికి అతనిపై వాత్సల్యం పెరగి ఒక రోజు ప్లిడర్ను, ఇద్దరు సాక్షులను పిలిపించి తనకున్న యావదాస్తిఅతడికి మాత్రమె చెందేవిదంగా విల్లు రాసేశాడు.
వీలునామ వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అవాక్కైపోయారు. జేమ్స్ చాపిన్కి భార్య, నలుగురు కుమారులున్నారు. వారందరూ కేవలం అదే పొలంపైన ఆధారపడి జీవిస్తున్నారు. కేవలం మూడవ కుమారుడికే యావదాస్తిని అకస్మాతుగా రాయటం వలన ఇంట్లో అందరూ తల్లడిల్లిపోయారు. తండ్రి అనంతరం సోదరలను, తల్లిని మార్షల్ బయటికి గెంటివేస్తే తమ గతి ఏంకావాలి? శేష జీవితం ఎలా గడుస్తుంది? అనే ప్రశ్నలతో సతమతమై, జేమ్స్ ను వీలునామా మార్చమని అడిగారు. అతను ససేమిరా మార్చనన్నాడు.
కాల గర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. జేమ్స్ కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో కుమారులు, భార్య తనకు చేసే సపర్యలు అతనిని వీలునామా గురించి మరోసారి ఆలోచించేలాగా చేసాయి. వెంటనే అతి కష్టంగా ఒక పెన్ను, కాగితం తీసుకోని, ఎవరూ చూడకుండా తన ఆస్తిని నలుగురు కొడుకులు, భార్య సమానంగా అయిదు భాగాలు చేసుకొని పంచుకోవాలని వీలునామా తిరిగి రాసి సంతకం పెట్టి ఎటువంటి సాక్షులు సంతకాలు లేకుండా దానిని జాగార్తగా మడిచి తన ఇంట్లోనే ఉన్న తన తాతగారి పురాతన బైబిలు కవర్లో ఉంచాడు.
అనంతరం మరొక చిన్న కాగితం తీసుకోని దానిమీద - " నా తాతగారి బైబిల్ చుడండి. మీకు మంచి జరుగుతుంది." అని రాసి ఒక ప్రత్యెక స్థానంలో ఉంచుదామని ఆలోచిస్తుండగా ఎవరో వస్తున్న అలికిడి విని వెంటనే అది జేబులో ఉన్న రహస్య అరలో దాచేసాడు. ఆ అర గురించి ఎవరికీ తెలియదు.
విధివశాత్తూ ఆ మర్నాడే జేమ్స్ మరణించాడు. కర్మకాండ యధావిదిగా జరిగిన తరువాత పెద్దమనుష్యుల సమక్షంలో మూడవ కొడుకు మార్షల్, ఆస్తిని కైవసం చేసుకున్నాడు. అతని భార్య ప్రోద్భలం వలన మెల్ల మెల్లగా సోదరులను, తల్లిని హింసించటం మొదలుపెట్టాడు. అది తమ ఖర్మ అని కష్టాలను అనుభవిస్తూ నాలుగు సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చారు.
ఒక శుభోదయ వేళలో జేమ్స్ రెండవ కొడుకు పింకీ "తన తండ్రి రాత్రి కలలోకి వచ్చి, జరుగుతున్న పరిస్థితికి విచారిస్తున్నానని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడని, తానూ ఎప్పుడూ తొడుక్కునే గళ్ళ కోటు చూపించి దాని జేబులో వెతకమమని ఆదేశిం "'చాడని అన్నాడు. దాని గురించి ఎవరూ పట్టించుకోపోయినా, పింకీ మాత్రం కుతూహలం కొద్దీ కోటును పాత బట్టల నుండి వెతికి తీసుకోని అందరి సమక్షంలో కోటును పూర్తిగా విప్పి అందులోని కాగితాన్ని తీసాడు. అందులో రాసిన ప్రకారం పాత బైబిల్ వెతకడం మొదలు పెట్టాడు. కాని ఆ బైబిలను తాను తన తమ్ముడికి చాలాకాలం క్రితం ఇచ్చి వేశానని పింకీ తల్లి చెప్పడంతో నిరుత్సాహంగా కులబడిపోయాడు ఆమె తమ్ముడు 800 మైళ్ళ దూరంలో ఉన్నాడు.
ఈలోగా ఆ విషయం తెలుసుకున్న మార్షల్ వీళ్ళంతా ఎదో దొంగ విల్లును సృష్టించి తనను మోసం చేయబోతున్నారని కోర్టులో కేసు దాఖలు చేశాడు.
పట్టు వదలని విక్రమార్కునిలాగా పింకీ ఎనిమిదివందల మైళ్ళు ప్రయాణం చేసి తన మామను కలుసుకొని పాత బైబిల్ గురించి వాకబు చేశాడు. కానీ అతని మామ ఆ పాత బైబిల్ తన పాత ఇంటిలో వదిలివేసాననీ, ఆ ఇల్లు కూలిపోవడం వలన ముఖ్యమైన వస్తువులు తెచ్చుకోవటంలో దానిసంగతి మర్చిపోయాననీ చెప్పాడు. అయినా ఆ ఇంటికి వెళ్లి ప్రయత్నం చేద్దామని చెప్పాడు.
మర్నాడు తెల్లవారుతూనే ఇద్దరూ పాత ఇంటికి వెళ్ళి కూలిన భాగాలు ఏరుతూ చివరికి అవసానదశలో నున్న బైబిల్ పట్టుకున్నారు. అందులోని వీలునామా మాత్రం బైబిల్ కవర్లో భద్రంగా ఉంది.
అది తీసుకోని ఇంటికి వచ్చేసరికి మార్షల్ అంతకుముందు రోజే గుండెపోటుతో మరణించాడనే వార్త పింకీని దిగ్భ్రాంతి పరచింది. వీలునామా చూసిన మార్షల్ భార్య అది ఖచ్చితంగా మామగారి చేతివ్రాత అని తృప్తిపడి కోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకొని, ఆస్తిని సమానంగా పంచడానికి ఒప్పుకుంది.
1927 ఏప్రియల్ 19న ఆస్తి పంపకం పెద్దల సమక్షంలో జరిగింది. ప్రపంచ పత్రికలన్నీ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి.
లండన్లోని సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్ వారు ఈ సంఘటనను దృవీకరించారు. స్వప్నాలలో జరిగే ప్రతి సంఘటనకు ఎదో అర్ధం ఉంటుందనీ, అది అప్పుడు కాకపోయినా తరువాత దాని అంతరార్థం తెలుస్తుందనీ కూడా వారు అభిప్రాయపడ్డారు. ప్రసిద్ద మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఫ్రాయిడ్ కుడా తన కలల సిద్దాంతాలలో "అనిచివేయబడ్డ బలమైన కోర్కెలను తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం ప్రయత్నిస్తూ అవి సఫలమవడానికి పద్దతులను అన్వేషిస్తాడని, ఆ ప్రయత్నంలో వ్యక్తి కలల ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనటాని అవకాశ ముందని" వ్యాఖ్యానించాడు.
ఇక్కడ ఈ కేసులో పింకీ, తన తండ్రి ఆస్తి తనకు రాకుండా పోయిందన్న వ్యధతో అహోరాత్రులు అదే ఆలోచిస్తూ ఉండటం వలెనే కాకుండా తన తండ్రి తప్పకుండా వీలునామాను మార్చి ఉండవచ్చుననే ధృడమైన నమ్మకం ఉండటం వలన కుడా పింకీ తండ్రి కలలో వచ్చి, అసలు సంగతి వివరించినట్లుగా అనిపించి ఉండవచ్చు.
సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్

No comments:
Post a Comment