Sunday, 25 September 2016


నిజం చెప్పిన కల

     జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడుకు మార్షల్ ని వెంటపెట్టుకొని పొలానికి పోయి, తిరిగి చీకటి పడ్డాకా తిరిగి ఇంటికి రావటం తన దినచర్య. ఎక్కువ సమయం మార్షల్తో గడపడం వలన తండ్రికి అతనిపై వాత్సల్యం పెరగి ఒక రోజు ప్లిడర్ను, ఇద్దరు సాక్షులను పిలిపించి తనకున్న యావదాస్తిఅతడికి మాత్రమె చెందేవిదంగా విల్లు రాసేశాడు.

      వీలునామ వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు అవాక్కైపోయారు. జేమ్స్ చాపిన్కి భార్య, నలుగురు కుమారులున్నారు. వారందరూ కేవలం అదే పొలంపైన ఆధారపడి జీవిస్తున్నారు. కేవలం మూడవ కుమారుడికే యావదాస్తిని అకస్మాతుగా రాయటం వలన ఇంట్లో అందరూ తల్లడిల్లిపోయారు. తండ్రి అనంతరం సోదరలను, తల్లిని మార్షల్ బయటికి గెంటివేస్తే తమ గతి ఏంకావాలి? శేష జీవితం ఎలా గడుస్తుంది? అనే ప్రశ్నలతో సతమతమై, జేమ్స్ ను వీలునామా మార్చమని అడిగారు. అతను ససేమిరా మార్చనన్నాడు.

   కాల గర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. జేమ్స్ కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో కుమారులు, భార్య తనకు చేసే సపర్యలు అతనిని వీలునామా గురించి మరోసారి ఆలోచించేలాగా చేసాయి. వెంటనే అతి కష్టంగా ఒక పెన్ను, కాగితం తీసుకోని, ఎవరూ చూడకుండా తన ఆస్తిని నలుగురు కొడుకులు, భార్య సమానంగా అయిదు భాగాలు చేసుకొని పంచుకోవాలని వీలునామా తిరిగి రాసి సంతకం పెట్టి ఎటువంటి సాక్షులు సంతకాలు లేకుండా దానిని జాగార్తగా మడిచి తన ఇంట్లోనే ఉన్న తన తాతగారి పురాతన బైబిలు కవర్లో ఉంచాడు. 




           అనంతరం మరొక చిన్న కాగితం తీసుకోని దానిమీద - " నా తాతగారి బైబిల్ చుడండి. మీకు మంచి జరుగుతుంది."  అని రాసి ఒక ప్రత్యెక స్థానంలో ఉంచుదామని ఆలోచిస్తుండగా ఎవరో వస్తున్న అలికిడి విని వెంటనే అది జేబులో ఉన్న రహస్య అరలో దాచేసాడు. ఆ అర గురించి ఎవరికీ తెలియదు.

            విధివశాత్తూ ఆ మర్నాడే జేమ్స్ మరణించాడు. కర్మకాండ యధావిదిగా జరిగిన తరువాత పెద్దమనుష్యుల సమక్షంలో మూడవ కొడుకు మార్షల్, ఆస్తిని కైవసం చేసుకున్నాడు. అతని భార్య ప్రోద్భలం వలన మెల్ల మెల్లగా సోదరులను, తల్లిని హింసించటం మొదలుపెట్టాడు. అది తమ ఖర్మ అని కష్టాలను అనుభవిస్తూ నాలుగు సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చారు.

        ఒక శుభోదయ  వేళలో జేమ్స్ రెండవ కొడుకు పింకీ "తన తండ్రి రాత్రి కలలోకి వచ్చి, జరుగుతున్న పరిస్థితికి విచారిస్తున్నానని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడని, తానూ ఎప్పుడూ తొడుక్కునే గళ్ళ కోటు చూపించి దాని జేబులో వెతకమమని ఆదేశిం "'చాడని అన్నాడు. దాని గురించి ఎవరూ పట్టించుకోపోయినా, పింకీ మాత్రం కుతూహలం కొద్దీ కోటును పాత బట్టల నుండి వెతికి తీసుకోని అందరి సమక్షంలో కోటును పూర్తిగా విప్పి అందులోని కాగితాన్ని తీసాడు. అందులో రాసిన ప్రకారం పాత బైబిల్ వెతకడం మొదలు పెట్టాడు. కాని ఆ బైబిలను తాను తన తమ్ముడికి చాలాకాలం క్రితం ఇచ్చి వేశానని పింకీ తల్లి చెప్పడంతో నిరుత్సాహంగా కులబడిపోయాడు ఆమె తమ్ముడు 800 మైళ్ళ దూరంలో ఉన్నాడు.

         ఈలోగా ఆ విషయం తెలుసుకున్న మార్షల్ వీళ్ళంతా ఎదో దొంగ విల్లును సృష్టించి తనను మోసం చేయబోతున్నారని కోర్టులో కేసు దాఖలు చేశాడు.

      పట్టు వదలని విక్రమార్కునిలాగా పింకీ ఎనిమిదివందల మైళ్ళు ప్రయాణం చేసి తన మామను కలుసుకొని పాత బైబిల్ గురించి వాకబు చేశాడు. కానీ అతని మామ ఆ పాత బైబిల్ తన పాత ఇంటిలో వదిలివేసాననీ, ఆ ఇల్లు కూలిపోవడం వలన ముఖ్యమైన వస్తువులు తెచ్చుకోవటంలో దానిసంగతి మర్చిపోయాననీ చెప్పాడు. అయినా ఆ ఇంటికి వెళ్లి ప్రయత్నం చేద్దామని చెప్పాడు.


      మర్నాడు తెల్లవారుతూనే ఇద్దరూ పాత ఇంటికి వెళ్ళి కూలిన భాగాలు ఏరుతూ చివరికి అవసానదశలో నున్న బైబిల్ పట్టుకున్నారు. అందులోని వీలునామా మాత్రం బైబిల్ కవర్లో భద్రంగా ఉంది.


    అది తీసుకోని ఇంటికి వచ్చేసరికి మార్షల్ అంతకుముందు రోజే గుండెపోటుతో మరణించాడనే వార్త పింకీని దిగ్భ్రాంతి పరచింది. వీలునామా చూసిన మార్షల్ భార్య అది ఖచ్చితంగా మామగారి చేతివ్రాత అని తృప్తిపడి కోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకొని, ఆస్తిని సమానంగా పంచడానికి ఒప్పుకుంది.


     1927 ఏప్రియల్ 19న ఆస్తి పంపకం పెద్దల సమక్షంలో జరిగింది. ప్రపంచ పత్రికలన్నీ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. 


        లండన్లోని సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్ వారు ఈ సంఘటనను దృవీకరించారు. స్వప్నాలలో జరిగే ప్రతి సంఘటనకు ఎదో అర్ధం ఉంటుందనీ, అది అప్పుడు కాకపోయినా తరువాత దాని అంతరార్థం తెలుస్తుందనీ కూడా వారు అభిప్రాయపడ్డారు. ప్రసిద్ద మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఫ్రాయిడ్ కుడా తన కలల సిద్దాంతాలలో "అనిచివేయబడ్డ బలమైన కోర్కెలను తీర్చుకోవడానికి మానవుడు నిరంతరం ప్రయత్నిస్తూ అవి సఫలమవడానికి పద్దతులను అన్వేషిస్తాడని, ఆ ప్రయత్నంలో వ్యక్తి కలల ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనటాని అవకాశ ముందని" వ్యాఖ్యానించాడు.


   ఇక్కడ ఈ కేసులో పింకీ, తన తండ్రి ఆస్తి తనకు రాకుండా పోయిందన్న వ్యధతో అహోరాత్రులు అదే ఆలోచిస్తూ ఉండటం వలెనే కాకుండా తన తండ్రి తప్పకుండా వీలునామాను మార్చి ఉండవచ్చుననే ధృడమైన నమ్మకం ఉండటం వలన కుడా పింకీ తండ్రి కలలో వచ్చి, అసలు సంగతి వివరించినట్లుగా అనిపించి ఉండవచ్చు. 


సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్


Friday, 23 September 2016


లివిటేషన్(గాలిలో ఎగరటం)


     యోగశక్తితో వాయుస్తంభన, అగ్నిస్తంభన, జలస్తంభన వంటి అసాధరనా విద్యలను అవలీలగా ప్రదర్శించవచ్చని మనం విన్నాం,చదువుకున్నాం. కానీ ఎటువంటి శక్తి, సాధన లేకుండా కూడా వ్యక్తులు గాలిలో ఎగరటం సాధ్యమేనని న్యూయార్క్ లోని పారా సైకాలజీ లేబరేటరీ శాస్ర్తజ్ఞులు ధృవీకరించారు. ఇది సాధన చేయకుండానే కొందరికి స్వతస్సిద్దంగా అబ్బుతుందని కుడా అన్నారు. 1973లో ఇంగోస్వాన్ అనే శాస్ర్తజ్ఞునిపై ఎన్నో ప్రయోగాలు చేసి, మనిషి గాలిలో ఎగరటం(లివిటేషన్) సాధ్యమే అన్నారు.

         లండన్లో కోలిన్ ఇవాన్స్ అనే వ్యక్తికీ ఈ శక్తి ఉన్నట్టు విచిత్ర పరిస్థితిలలో వెల్లడైంది. అది అతని జీవితాన్నే మార్చివేసింది. అతను విద్యార్ధిగా ఉన్న రోజుల్లలో స్కూలలో చాలా అల్లరి చేసేవాడు. ఒకరోజు కొందరు విద్యార్థులు స్కూలు ప్రక్కనే వున్న ఒక భూస్వామి ఇంట్లో జామకాయలు దొంగతనంగా కోసుకోడానికి వెళ్ళారు. జామచెట్టు ఇంటి ఆవరణలో ఉంది, ఒక కొమ్మ మాత్రమె బయటికి ఉండేది. దాని నిండా కాయలే. అయితే ఆ కాయలు పిల్లలకు అందే ఎత్తులో లేవు. అప్పుడు  ఇవాన్స్ తన స్నేహితులతో ఒకరిని వంగమని చెప్పి, వాని నడ్డిమీద నుంచొని, బలం తీసుకోని ఒక్కసారి జామ కొమ్మ అందుకుందామని ఎగిరాడు అంతే! ఎగిరినవాడు అలా గాలిలో ఎటువంటి ఆసరా లేకుండా ఎత్తున ఉండిపోయాడు. అది చూసిన మిగతా పిల్లలు బెజారేత్తిపోయి ఇవాన్స్ ను ఏదైనా దెయ్యం పట్టిందేమో అని వెనక్కి చూడకుండా ఇంటికి పరుగు లంఖించుకున్నారు.

         ఈ హటాత్సంఘటనకు ఇవాన్స్ కూడా బెంబేలెత్తిపోయి అరవటం మొదలుపెట్టాడు. అలా ఒక నిముషం ఉన్న తరువాత మెల్లగా క్రిందికి చేరాడు. ఇంటికిపోయి చెప్తే ఇంట్లో ఎవరు నమ్మలేదు. కావాలంటే మళ్ళి ప్రయత్నిస్తానని చెప్పి ఇవాన్స్ ఒక కుర్చిపై నుంచి ఎగిరాడు. చిత్రం! అతను అలాగే మళ్ళి గాలిలో ఉండి ఒక నిముషం తరువాత దిగిడాడు. ఈసారి ఇవాన్స్ భయపడలేదు. తప్పక క్రిందకు దిగుతానని అతనికి కలిగింది. బంధువుల కొరకు అయితేనేం ప్రతిరోజూ ఈ విద్యను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు.


     ఈ అద్భుతం విన్న స్టీవెన్ అనే సర్కస్ కంపనీ యజమాని ఇవాన్స్ తల్లిదండ్రులను సంప్రదించి, తానూ ఇవాన్స్ మంచి చెడ్డలు చూసుకుంటూ బాగా చదివిస్తాననీ, సాయంత్రం సమయాలలో మాత్రం అతనిచేత ‘లివిటేషన్’ ప్రదర్శనలు చేయిస్తాననీ, దానికి ప్రతి ఫలంగా కొంత సొమ్మును ముట్టచేప్తాననీ చెప్పి తీసుకువెళ్ళాడు.

        ఆ రోజు నుండి ఇవాన్స్ కు సిరి ఎత్తుకుంది. సర్కస్ లో మిగతా అంశాలకన్నా లివిటేషన్ మాత్రమే ప్రజలను విపరీతంగా ఆకట్టుకునేది. సర్కస్ కంపనీతో పాటు తానూ కూడా చాలినంత ధనం సంపాదించుకున్న తర్వాత ఇవాన్స్ బయటికి వచ్చి ప్రసాంతమైన జీవితం గడపసాగాడు.

     ఒకసారి కొందరు హేతువాతులూ, డాక్టర్లు, హిప్నాటిస్ట్ లూ, జర్ననిస్ట్ లూ ఇవాన్స్ ను పరిక్షచేయదలచి(1938 లో) లండన్ లోని ’కాన్ వే’ హాలులో అతని ప్రదర్శన ఏర్పాటు చేసారు. మాజిక్ తెలిసినవారు అతని శరీరం పై అయస్కాంతానికి సంభందించిన పరికరాలేమైన ఉన్నాయోమోనని పరిక్ష చేసారు. అందరి పరిక్షలు ఐన తర్వాత ఇవాన్స్ ఒక్కసారి గాలి పీల్చి చూస్తుండగానే ఎగిరి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. ఒక నిముషం తరువాత క్రిందకి దిగి తిరిగి తన శరీరాన్ని అందరూ పరిక్షచేసుకోవటానికి అవకాశం ఇచ్చాడు.

   దేముడు, దెయ్యం అనకుండా, కేవలం తనకు తెలియని ఒక అద్భుత శక్తి వలన అసాదారణమైన ఈ పని చేయగలుగుతున్నాననీ, తానూ ఎప్పుడైనా పరీక్షకు సిద్దమని ప్రకటించాడు.

     ఇటువంటి అసాధారణ విద్యలను ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తమ ఇష్టం వచ్చినప్పుడు ప్రదర్శించిన మహాత్ములు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అది వారికి పుట్టుకనునుండి వచ్చి ఉండవచ్చు. లేదా అభ్యాసం వల్ల వచ్చి ఉండవచ్చు. మాయలు మంత్రాలు లేకుండా ఇటువంటి శక్తులను ప్రదర్చించ వచ్చని రష్యా, బల్గేరియా దేశాలు కూడా ఒప్పుకున్నాయి. దానికి సంబంధించిన లేబరేటరీలు కూడా అక్కడ వెలిసాయి.
ఇంగ్లాండుకు చెందిన సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డేనియల్ డగ్లస్ హోమ్ ‘లివిటేషన్’ లో అందవేసిన చేయి. ఒక సారి పుర ప్రముఖులు, విజ్ఞుల సమావేశంలో తాను గాలిలో ఎగిరి, అలా తేలుతూ ఒక కిటికిలోనుండి మరొక కిటికీలో నుండి లోపలికి వచ్చాడు.

సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్


  

Thursday, 22 September 2016

అద్భుత వైద్యం


      టెలీపతికి సంబంధించిన ప్రయోగాలు గడిచిన పాతిక సవత్సరాలలో ఎన్నో జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. 1959లో జరిగిన ఒక ప్రయోగం వైజ్ఞానికంగా ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది.

       “నాటిలస్” ఒక జలాంతర్గామి పేరు. టెలీపతి ద్వారా మాట్లాడుకునే శక్తి కలిగిన ఇద్దరు వ్యక్తులలో ఒకరిని జలాంతర్గామిలో ఉంచి సముద్రంలో కొన్ని వందల అడుగుల లోతుకు పంపించారు. రెండవ వ్యక్తిని అక్కడికి కొన్ని వేళ్ళమైళ్ళ దూరంలో ఉంచారు. ఒక నిర్ణీత సమయంలో పరస్పరం వారిద్దరూ సంభాషించుకొనే ఏర్పాటు చేసారు. కొన్ని వందల అడుగుల నీటి క్రింద ఉన్న వ్యక్తి అక్కడకి వేళ్ళ మైళ్ళ దూరంలో వ్యక్తితో టెలీపతి ద్వారా విజయవంతంగా సంభాషించినట్లు ప్రయోగం నిర్వహించిన ఒక వైజ్ఞానికవేత్త నిర్ధారించారు.

    భావతరంగాలు మవునంగా గాలిలోనుంచో, సున్యంనుంచో వందల, వేళ్ళ మైళ్ళు ప్రయాణించటం వేరు. కొన్ని వందల అడుగుల మందంలో ఉన్న నీటి పొర నుండి పయనించటం వేరు. గాలినుండి, శూన్యం నుండీ రేడియో తరంగాలు ప్రయాణిస్తాయి, కాని అలా సముద్ర జలాల్లో అంత దూరం చొచ్చుకుపోలేవు.

        టెలిపతి శక్తి కలిగిన వ్యక్తులు ఎంతో దూరంలో ఉన్నా, ఎక్కడున్నా, టెలిఫోన్, టెలిగ్రాఫ్ లాంటి సాధనాలేవి లేకుండా సంభాషించుకోవటం “నాటిలేస్” ప్రయోగం రుజువు చేసింది. టెలిపతి శక్తిని పరీక్షించడానికి అమెరికాలో ‘హెన్స్కాంబ్ ఫీల్డ్’(బెడ్ఫోర్డ్) అనే చోట శాస్త్రజ్ఞులు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులలో ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, ఒక భౌతిక శాస్త్రజ్ఞుడు, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, ఒక మెకానికల్ ఇంజినీర్ ఉన్నారు.

మరొక సంఘటన చూద్దాం....



    ఎడ్గార్ ఒక రైతు కొడుకు. అతని మెదడులోని అసాధారణ ప్రజ్ఞా విశేషాలు అమెరికన్ మెడికల్ అసోషియేషన్నూ ఆకర్షించాయి.

    ఎడ్గార్ జీవితం చిత్రమైనది. అతడికి చిన్నతనంలోనే పెద్ద దెబ్బ జబ్బు చేసింది. విపరీతంగా జ్వరం వచ్చి అపస్మారక  స్థితిలో పడిపోయాడు. సృహ తెప్పించడానికి ఆ మందులు, ఈ మందులు ఇచ్చి అవస్థ పడుతుండగా, అపస్మారక స్థితిలోనే ఎడ్గార్ ఉన్నట్లుండి స్ఫుటంగా బిగ్గరగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆశ్చర్యపోతున్న డాక్టర్లకు తానూ ఎందువల్ల అనారోగ్యం పాలైనది వివరించాడు. కొన్ని మూలికలు పేర్లు చెప్పి, వాటిని అరగదీసి తన వెన్నుముకకు పూస్తే జబ్బు తగ్గిపోతుందన్నాడు.

     ఎడ్గార్ చెప్పిన మాటలు ఏవో అపస్మారకంలో మాట్లాడినట్లు లేవు. ఆరి తేరిన డాక్టర్ లా మాట్లాడాడు. అక్కడున్న డాక్టర్లు, బంధుమిత్రులు ఈ వింత ఏమిటో అర్ధం కాకపోయినా, ఎడ్గార్ చెప్పిన మూలికలు తెచ్చి, అతను చెప్పినట్లే వెన్నెముకకు మూలికల గంధం పుశారు. కొద్ది రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. అత్యంత ఆశ్చర్యకరమైన ఈ వార్త దేశమంతటా పోక్కిపోయింది. కొంత మంది పెద్దలు  ఎడ్గార్ ను హిప్నటైజ్ చేసి అనారోగ్యానికి మందు అడిగితె బావుంటుందని సూచించారు. ఎడ్గార్ దానికి సుతనాము అంగికరించలేదు. ఇలా ఉండగా ఒక రోజున అతని ఆప్తమిత్రుడోకరు జబ్బు పడ్డారు. ఎడ్గార్ లాటిన్ లో కొన్ని మాటలు చెప్పి, తానూ కొన్ని మాటలు చెప్పి, తానూ కొన్ని మందుల పేర్లు చెప్తానని అవి తీసుకురమ్మని పురమాయించాడు.

      ఎడ్గార్ లాటిన్ కాదుకదా, మరే భాష చదువుకున్నవాడు కాదు. ఈ వింత ఏమిటో చూద్దామని అతను చెప్పిన మందులు తెచ్చి వాడారు. స్నేహితుడి ఆరోగ్యం విచిత్రంగా మెరుగైంది. అమెరికన్ మెడికల్ అసోషియేషన్ ఒక కమీషన్ ను నియమించి, ఇలాంటి మరొక సంఘటన జరిగితే సమగ్ర విచారణ జరపవలసిందిగా ఆదేశించింది.  

   ఒకసారి మహా సంపన్నుడొకరికి ఎడ్గార్ ఎదో మందు చెప్పాడు. ఆ మందు అక్కడున్న డాక్టర్లేవరికి తెలియదు. ఎప్పుడూ వినను కూడా లేదన్నారు. శ్రీ మంతుడు ఎందుకైనా మంచిదని అంతర్జాతియ ప్రచారం గల పత్రికలో ప్రకటన వేయించాడు. ప్రకటన ఫలించింది. ఫారిన్ నుండి ఒక యువ డాక్టర్ ఉత్తరం వ్రాశాడు. అతడి తండ్రి చాల కాలం క్రిందట ఈ మందును తయారు చేసేవాడట. ఇప్పుడు చేయటం లేదు. ఎడ్గార్ చెప్పినదానికి ఈ మందు సరిగ్గా సరిపోయింది. ఆ డాక్టర్ ఆ మందు తాయారు చేసాడనుకోండి- అది వేరే విషయం.


     మరొక సందర్భంలో ఎడ్గార్ మరో మందు పేరు చెప్పి, అక్కడికి చాల దూరంలో ఉన్న ఫలానా వూళ్ళోని ఫలానా లేబరేటరీకి వెళితే అక్కడ ఆ మందు దొరుకుతుందని చెప్పాడు. అక్కడికి ఫోన్ చేస్తే  మందు ఉన్నదని సమాదానం వచ్చింది. టెలిపతి అంటే నాన్సెన్స్ అని కొట్టిపారేసిన కమిషనర్ల బృందం యదార్ధాన్ని అంగికరించ తప్పలేదు. ఎడ్గార్ ఏనాడు ఒక వైద్య శాస్ర్త గ్రందాన్ని కూడా చదవలేదు. అసలు అతడి చదువే అంతంతమాత్రం. ఆశ్చర్యకరంగా మందులు వ్రాసి ఇస్తుంటే డాక్టర్ల తలలు తిరుగుతుండేవి. దేశం అంత అతడి పేరు మోగిపోయింది. రోజుకు రెండు సార్లు అతడు ఎక్కడి ఎక్కడినుంచో వచ్చే రోగులకు అతడి మందులు వ్రాసి ఇస్తుండేవాడు.

సౌజన్యం : డా|| బి.వి. పట్టాభిరామ్ 

Tuesday, 20 September 2016


జరగబోయేది ముందే తెలిస్తే !

     కలలు కనటం, అవి నిజం అవడం లాంటి సంఘటనలు దాదాపు చరిత్ర ప్రారభం అయినప్పటి నుండీ ఉన్నాయి. జరగబోయే సంఘటనలను ముందుగానే చూడటం, ఎదుర్కోబోయే ప్రమాదాలను గురించి ముందుగానే హెచ్చిరికలు  పొందటం వంటి అనుభవాలు దాదాపు ప్రతివ్యక్తి ఎప్పోదో పొంది ఉంటారనేది నిర్విరాద అంశం.

    ప్రసిద్ద మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఫ్రాయిడ్ ప్రతి కలకు ఆధారం ఉంటుందనీ, సుప్తావస్తలో ప్రతి వ్యక్తి కొన్ని వింత అనుభవాలకు లోనవుతాడనీ, వాటిని మరునాడు గుర్తు చేసుకొని జాగార్తగా పరిశిలిస్తే తప్పక దాని అర్ధం విశదం కాగలదనీ, పేర్కొన్నారు.

   మార్క్ట్వైన్ అనే అతను మిస్సిసి నగరంలో నావికాదళంలో పనిచేస్తున్న సమయంలో ఒకనాడు ఒక చిత్రమైన కల కన్నాడు. అందులో తన సోదరుడు ఒక పడవలో మరణించి ఉన్నట్లు చూశాడు. ఉదయం లేచి అది కేవలం కలే కదా అనుకోని సరిపెట్టుకున్నాడు. కాని ఆ కల నిజమైంది. కొద్ది రోజులలో అతని సోదరుడు ఆస్మాత్తుగా, పడవలోనే మరణించాడు. ఇది యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదనీ, తనకిటువంటి అనుభవాలు చాలా జరిగాయని మార్క్ట్వైన్ పేర్కొన్నాడు.

    జర్మనీ చరిత్రను మలుపు తిప్పిన ప్రముఖుడు బిస్మార్క్కి కూడా కలలపై ఎంతో నమ్మకం ఉంది. తనకు వచ్చిన ప్రతి స్వప్నం దాదాపు నిజం అయిందని అంటాడు. “థాట్స్ అండ్ మెమోరీస్” అనే పుస్తకంలో తానూ యుద్దాలలో పొందిన ప్రతి విజయం గురించి ముందుగానే తానూ పొందిన కలల ద్వారా తెలుసుకున్నాని పేర్కొన్నాడు.
  

               జరగబోయే విషయాలను కలల ద్వారా ముందుగానే గ్రహించే శక్తినీ “ప్రీ-మానిషన్” అంటారు. అదే ప్రకారంగా జరగబోయే ప్రమాదాలను ముందుగానే గ్రహించే శక్తిని “ప్రీ-కాగ్నిషన్” అంటారు. శాస్త్రజ్ఞులు.

        స్వీడన్ దేశంలో మిసెస్ ఇవా హెల్స్టాన్ పేరు పొందిన పారా సైకాలజిస్ట్. ఆమె కలలపై పరిశోధనలు చేయకపోయినా, ఒక రోజు ఆమె విచిత్రమైన కల కన్నది. మరునాటి ఉదయమే లేచి కల నిజమో,కాదో అన్నమాట పక్కకు నెట్టి ఆ కలలో చూసిన దృశ్యాన్ని, వెంటనే ఓ పేపర్పై చిత్రించి తోటి శాస్త్రజ్ఞులందరికీ చూపించింది. బొమ్మను చూసిన అందరూ ఒకింత ఆశ్చర్యపడినా, అది అసంభవం అని తేల్చి వేశారు.

      ఇంతకు ఆమె పొందిన కల ఏంటంటే తాము నివసిస్తున్నస్టాక్ హోమ్ నగరంలో తానూ,తన భర్త గాలిలో ఎగురుతూ నగర నడిబొడ్డు దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ చూశారట. ఒక నీలం రంగులో ఉన్నబస్సు, పచ్చరంగులో ఉన్నఒక లోకల్ ట్రైన్ పెద్ద శబ్దంతో గుద్దుకొని ఎంతోమందికి గాయలుకుడా తగిలాయంట.

        ఆ దృశ్యం యొక్క బొమ్మను చూసినవారు అందులో బస్సుకూ, ట్రైన్కూ ఉన్నరంగులు గురించి మాట్లాడారు. ఎందుకంటే అప్పుడు ఆ నగరంలో నీలంరంగు బస్సులుకాని, పచ్చరంగు రైళ్ళుకాని లేవు. పైగా గాలిలో ఎగరటం వారికినవ్వు కుడా తెప్పించింది.
       
         ఒక సంవత్సరం తరువాత అక్కడున్న రైళ్లకు పచ్చరంగు వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్నాళ్లకు వివిధ రంగుల్లో ఉండే బస్సులను ఎకరీతిగా నీలంరంగులు వేయాలని కూడా నిర్ణయించి అది అమలు చేసారు. మిసెస్ ఈవాకు తన కలలో చూసిన దృశ్యం కొంతమేర నిజమైందని ఎంతో సంతోషించింది.

      అంతవరకూ ఈ విషయాన్ని జాగర్తగా పరిశిలిస్తున్న కొందరు విమర్శకులు కూడా ఈ మార్పులు గమనించి దిగ్భ్రమ చెందారు. బస్సులకు, రైళ్ళకు రంగులు మార్చటంలో ఆమె ప్రమేయం ఎంతమాత్రం లేదని వారికి తెలుసు.

       సరిగ్గా ఆమెకు కలవచ్చిన రెండు సంవత్సరాల తరువాత అంటే మార్చి 4, 1956న స్టాక్ హోమ్ నగర నడిబోడ్డులోనున్న జంక్షన్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది సరిగ్గా మిసెస్ ఈవా స్వప్నంలో చూసిన జంక్షనే. ఇకపోతే యాక్సిడెంట్ జరిగినది కూడా నిలంరంగులో ఉన్న బస్సుకు, పచ్చరంగులో ఉన్న రైలుకూ మాత్రమే.
  
      ఈ సంఘటన దేశ ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. జరిగిన తరువాత చెప్పి నమ్మించడం కన్నా ముందుగానే తానూ అందరికి చెప్పటం వలన ప్రజలకు కలలపై ఖచ్చితమైన గురి ఏర్పడింది. ఇది కట్టుకధ కాదు రికార్డడ్ ఫ్యాక్ట్. స్వీడన్ చరిత్రలో లిఖించబడిన యథార్థ సంఘటన.




Monday, 12 September 2016

      దివ్య దృష్టి

          మిసెస్ వాట్సన్ అమెరికాలో ఒక మినిష్టర్ కూతురు. చిన్నతనంనుండి ఆమె క్రమశిక్షణతో పెరిగింది. తండ్రివద్ద ఉంటె రాజకీయాలు అబ్బుతాయోమోనని ఆమె తాతగారు తన వద్దనే ఉంచుకొని ఆలనా పాలనా చూసేవాడు. ఆమెకు ముడనమ్మక్కాలంటే తగని మంట.

          వాట్సన్ వివాహం జరిపిన పిదప ఆమె ఇండియానా రాష్ట్రం వచ్చి స్థిరపడింది. ఇద్దరు పిల్లలు. తండ్రికన్నా తాతగారి వద్దనే ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆమె తాతగారింటికి నెలకు ఒక్కసారైనా వెళ్ళకుండా ఉండలేకపోయేది. తండ్రిని ఎప్పుడో ఏడాదికో, రెండేళ్లకు ఒకసారో చూసేది.

           ఒకరోజు ఇంట్లో అందరూ పడుకొని ఉండగా అర్థరాత్రి వాట్సన్ ఉల్లిక్కిపడి లేచింది. ఎవరో వచ్చి లేపినట్లుగా లేచి, చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక తలుపులన్నీ మరోసారి వేసి ఉన్నాయని చూసుకొని పడుకుంది. ఆ నిద్ర ఎంతోసేపు లేదు. తెల్లవారు ఝామున సరిగ్గా పావు తక్కువ నాలుగు గంటలకు ఆమెను ఎవరో తట్టి లేపుతున్నట్లై లేచింది. చూస్తే వచ్చి లేపింది ఎవరో కాదు - తన తాతయ్యే. కంగారు పడవద్దని చెప్పి, తన మంచంమీద కూర్చొని, తానూ మరో ఐయిదు నిముషాలలో మరణించబోతున్నాననీ, ఆ విషయం నీతో చెప్దామని వచ్చానని చెప్పాడు. తనను అత్యంత ప్రేమానురాగాలతో చూసే మనమరాలి తలపై నిమిరి మాయమయ్యాడు.



         మరుక్షణం "తాతయ్య నువ్వు మరణించడానికి వీలులేదు" అని గట్టిగా అరుస్తూ మిసెస్ వాట్సన్ పక్కమీద నుండి లేచింది. ఆ అరుపుకు పక్కనే ఉన్న భర్త, పిల్లలు కూడా ఉల్లిక్కిపడి లేచారు. భర్త అసలు సంగతి ఏంటి అని అడిగాడు. మిసెస్ వాట్సన్ జరిగిన సంగతి చెప్పింది.

        "అదంతా కేవలం కల, నేను నమ్మను. నువ్వు కుడా మనసు పాడుచేసుకోకు. హాయిగా పడుకో" అని భర్త ముసుగుతన్నబోయాడు. కాని మిసెస్ వాట్సన్ "నువ్వు వెంటనే ఫోన్ చేసి మా తాతగారు ఎలా ఉన్నారో తెలుసుకోనితిరాలి" అని బలవంతంగా బయటకు పంపించింది.

         వాట్సన్ బయటకు వచ్చి, ఎదిరింట్లో ఉన్న ఫోన్ను ఉపయోగించి మామగారికి ఫోన్ చేశాడు. ఫోన్ అందుకున్న మామగారు "మేమే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడే మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. డాక్టర్లు ఇప్పుడే ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. మేరు వెంటనే బయలుదేరి రండి." అని చెప్పాడు.

         మిసెస్ వాట్సన్ ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆమెలో అంతర్లీనమైన ఆ శక్తి తన దగ్గరి వారికేదో విపత్తు వాటిల్లబోతుందని హెచ్చరించగా ఉల్లిక్కిపడి లేచిందనీ, ఆ తరువాత తెల్లవారు ఝామున తన తాత వచ్చి తను చచ్చిపోతున్నట్లు చెప్పినట్లుగా తనలోని శక్తి చెప్పిందనీ, నిజంగా ఆమె తన తాత రావటం, మాట్లాడటం అనేది కేవలం భ్రమని వారు నిర్ణయించారు.

సౌజన్యం : డా|| బి.వి.పట్టాబిరామ్ 

Sunday, 11 September 2016

ప్రాణం తీసిన కల

          

           మిస్ బెర్తా చాల అందగత్తె. వెర్మాంట్ పట్టణంలో ఆమె అందాన్ని గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ వూళ్ళో ప్రతి క్లబ్బు ఆమె కోసం అర్రులు చాస్తుంది. ఆమె పాల్గొన్నదంటే విందు వినోదాల విలువ హెచ్చుతుంది. కాసేపైన వచ్చి వెళ్ళమని ఆమెను ఆమె స్నేహితులు పార్టీలకు పిలుస్తుండటం నిత్యకృత్యమైంది.

         మిస్ బెర్తా ఒక రాత్రి ఎదో పార్టీకి వెళ్ళగా బాగా అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంది. పొద్దున్నా పదియినా గదినుండి బయటకు రాలేదు. ఇంతసేపు పడుకోవటం ఏంటని తల్లి కోప్పడటానికి గదిలోనికి వెళ్ళింది.కాని ఆశ్చర్యం ! మిస్ బెర్తా ఆ గదిలో లేదు. బాత్ రూమ్తో సహా ఇల్లంతా గాలించింది. పోనీ పొద్దున్నే లేచి ఏ స్నేహితుల ఇళ్ళకు వేల్లిందేమో అని అనుకుంటే అది లేదు. ఆమె బాయ్ ప్రెండ్స్ తమకు తెలియదంటే తమకు తెలియదన్నారు. అనుమానం వచ్చి చుట్టుపక్కల బావులూ, చెరువులు వెతికించింది. కానీ, ప్రయోజన శూన్యం. మూడురోజులపాటు వెతికి వెతికి వేసారిపోయింది. పొలిసు రిపోర్ట్ ఇచ్చారు. చుట్టపక్కల ఉళ్ళకు, మనుషులను పంపిచారు. వారం రోజులైంది అప్పటికే మిస్ బెర్తా జాడ తెలియనేలేదు.



        మిసెస్ టైటాస్ వేర్మాండ్ పట్టణంలో ఒక సామాన్య స్త్రీ.  ఆమె సామాన్య స్త్రీయే కానీ, ఆదసారణ ప్రతిభ ఆమెకు ఒకటున్నది. ఏదైనా ఒక సమస్యను తలుచుకొని నిద్రపోతే, కలలో ఆ విషయానికి సంబంధించిన సమాచారం ఆమెకు తెలుస్తుంది. ఒక రాత్రి బెర్తా గురించి అనుకోని పడుకుందట. కలలో ఆమెకు బెర్తా గురించి భయంకర విషయం తెలిసింది. మరునాడు ఉదయం పాపం పని కట్టుకొని ఆమె బెర్తా ఇంటికి వెళ్ళింది. బెర్తా తల్లిని కలుసుకొని ఆ ఊళ్ళోని షాకీర్ బ్రిడ్జి కింద నీటి మడుగున బాగా వెతికించమని సలహా ఇచ్చింది. నీటిలో బెర్తా శవం కుళ్లిపోయి ఉన్నట్లు మిసెస్ టైటాస్ కలలో కనిపించింది. నమ్మకం కలగపోయినప్పటికీ నలుగురు ఈతగాళ్ళు బ్రిడ్జి క్రిందినిటిలో చూశారు. శవం కనిపించలేదు. బెర్తా బందువులు ఇదంతా "నాన్సెన్" అన్నారు.

       మిసెస్ టైటాస్ ఆ రాత్రి మళ్ళా కలగన్నది. మరునాడు మళ్ళి బెర్తా తల్లివద్దకు వెళ్లి బ్రిడ్జి క్రింద మళ్లి వెతికించమనీ, బెర్తా శవం బురదలో బాగా లోతుకు కూరుకు పోయి ఉన్నదని చెప్పింది. ఈతగాళ్ళు మళ్ళి సరస్సులో దిగి లోతుకు వెళ్లి వెతికారు. ఈసారి కుళ్ళి శిధిలమైపోయిన బెర్తా శవం దొరికింది. గుర్తుపట్టటానికి వీలులేని స్థితిలో ఉన్నప్పటికీ, అది బెర్తా శవమే అని నిర్థారణ అయ్యింది.

      బెర్తా శవమైతే దొరికింది కాని, కొత్త పేచి వచ్చింది. శవం ఫలానా చోట ఉన్నదని టైటాస్ చెప్పింది కనుక, టైటాస్ హత్యచేసి ఉండాలని చాలామంది యువకులకు అనిపించింది. కలలో ఇలాంటి సమాచారం తెలిసిందిని టైటాస్ చెప్పడం పచ్చిమోసం, దగా అన్నారు వారంతా ముక్తకంటంతో.

      యువకుల ఆవేశం కట్టలుతెంచుకుంది. అందరూ వెళ్లి టైటాస్ ఇంటి మీదపడ్డారు. ఆమెను పట్టుకొని చితకోట్టారు. ఇంటికి నిప్పు అంటించారు. కానీ ప్రాణాలతో మిగిలిన టైటాస్ ఆసుపత్రి లో చేర్చారు. టైటాస్ ఇంకా కొద్ది సేపటిలో మరణిస్తుంది అనగా బెర్తా మరణ రహస్యం బయటపడింది. పీటర్ అనే యువకుడు బెర్తా ను అర్థరాత్రి తీసుకువెళ్ళి పీక నులిమి బ్రిడ్జిపై నుండి నీళ్ళలోనికి తోసివేసాడట. పాపం బెర్తా మరనోదంతాన్ని అయితే తెలిసుకుంది కానీ, టైటాస్ తనకు కలుగుతున్న ముప్పును గుర్తించలేకపోయింది. పీటర్ తన చేసిన నేరాన్ని పోలీసులకు చెప్పాడు. బెర్తాను ఎలా హత్య చేసింది వివరించాడు. కాని టైటాస్ ప్రాణాలు విడిచింది.

సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్   

Saturday, 10 September 2016

టెలిపతి - బ్యాంకు దోపిడీ

           అతీంద్రియ శక్తులను గురించి పరిశోధనలు రెండవ ప్రపంచయుద్ద కాలం నుండి వేగం పుంజుకున్నాయి. అసలు అతీంద్రియ శక్తులు నిజమో, కాదో ఆలోచనలు అందరికి కలిగినట్లే స్టాలిన్ లాంటి ప్రముఖులకు కలిగాయి ఆ రోజుల్లో.

            స్టాలిన్ నిర్మిస్తున్న రాజ్యాంగ వ్యవస్థకు, అతీంద్రియ విజ్ఞానానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, నిజ నిజాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన 1940లో స్వయంగా ఒక పరిక్ష జరిపించారు. 

         రెండవ ప్రపంచ యుద్దకాలంలో 'టెలిపతి' ప్రదర్శించిన వారిలో ఒల్ఫ్ మేస్సింగ్ ప్రసిద్దుడు. ఆయన పోలెండ్ దేశస్థడైనప్పటికి ప్రపంచం అంత అయన పేరు మారు మ్రోగింది. స్టాలిన్ ఆయనను పిలిచాడు. "కధలు చెప్పడం కాదు, కళ్ళెదుట చూపించు నమ్ముతాను" అన్నాడు.

            నోరు మెదపకుండా, సంజ్ఞలు చేయకుండా, రాసి చూపించకుండా తన మనసులో వచ్చిన ఆలోచనలను స్పష్టంగా ఎదుటివాడి మనసులో ప్రవేశ పెట్టగలగటం మేస్సింగ్ కు సులువు సూత్రం. ఎదుట ఉన్న వ్యక్తినే కాదు, ఎంత దూరంలో ఉన్నాసరే ఎదుటలేని వ్యక్తికీ సైతం తన భావాలను అయన ప్రసారం చేయగలడు. అదే టెలిపతి.



            మస్కోలోనే మేస్సింగ్ శక్తుల పరీక్షకు ఏర్పాటు జరిగింది. పలానా బ్యాంకుకు వెళ్లి టెలిపతి విద్య  సహాయంతో డబ్బు తీసుకురమ్మని ఆదేశించాడు స్టాలిన్. అలా డబ్బు తీసుకురావడం మోసమే అవుతుంది. అయినప్పటికీ అది పరిక్ష మాత్రమె కాబట్టి అందుకు ఒప్పుకున్నాడు. స్టాలిన్కు నమ్మకం ఉన్న ఐదుగురు సాక్షులను వెంటబెట్టుకొని బ్యాంకుకు వెళ్ళాడు. తిన్నగా క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి, ఒక తెల్ల కాగితం క్యాషియర్ కి ఇచ్చి లక్ష రుబుల్స్ ఇమ్మన్నాడు. అలా అంటున్నప్పుడే అవసరమైన భావ ప్రసారం జరిగిపోయింది. చేక్కుపై డబ్బు ఇవ్వడానికి సంబంధించిన లాంచానాలన్ని పూర్తి ఐనట్లు, డబ్బు ఇవ్వడమే తరువాయి అన్నట్లు క్యాషియర్ మనసులో అభిప్రాయం నాటుకుంది. చిరునవ్వుతో లక్ష రుబుల్స్ లెక్కపెట్టి  ఇచ్చాడు.

          మేస్సింగ్ తన వెంట వచ్చిన ఐదుగురు సాక్షులకు డబ్బు చూపించి ప్రదర్శన విజయవంతమైందని వారు అంగికరించినాక, మళ్ళి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి, తను ఇంతకముందు ఇచ్చిన లక్ష రుబుల్స్ చెక్కును ఒకసారి చూడమన్నాడు. క్యాషియర్ ఎంత వెతికితే మాత్రం అది కనిపిస్తుంది కనుక ! ఒక తెల్లకాగితం ముక్క మాత్రమే అతనకు అదనంగా కనపడింది. అతని వెన్నుముకలోనుండి వణుకు మెదలైంది. ముఖం వెలవెల పోయింది.

           మేస్సింగ్ సొమ్మును జాగర్తగా లెక్కపెట్టకోమని  తిరిగి ఇచ్చాడు. ఇదేమి అర్ధంకాక క్యాషియర్ మేస్సింగ్ కేసి, నోట్లకేసి, తెల్లకాగితంకేసి, మార్చి మార్చి చూసి ఆశ్చర్యంతో ముర్చపోయాడు. డాక్టర్ల చేసిన సపర్యల వలన క్యాషియర్ కోలుకున్నాడు. మేస్సింగ్ క్షమాపణ చెప్పుకున్నాడు.

   స్టాలిన్ కు నమ్మకం కుదిరింది. మేస్సింగ్కి ఈ అతీంద్రియ శక్తీ సహజంగానే లభించింది. ఆయన అభ్యాసం ద్వారా దానికి వెన్న పెట్టుకున్నాడు.

సౌజన్యం: డా|| బి.వి. పట్టాభిరామ్ 

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...