అబ్రహం లింకన్
బూట్ పాలిష్ అంటే గుర్తొంచింది. ఒకసారి అబ్రహం లింకన్ తన బూట్లు తానే పాలిష్ చేసుకుంటున్నాడు. ఆ సమయమ్లో ఒక మిత్రుడు అక్కడకి వచ్చాడు.
" అదేమిటి అబహం నీ బూట్లూ నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్! " అన్నాడు
వెంటనే అబ్రహం " మరి నువ్వెవరి బూట్లు పాలిష్ చేస్తావ్!" అని అనేసరికి ఆ మిత్రుడు దానిలోని చురకను గ్రహించి చిన్నబుచ్చుకున్నాడు!
ఆ తరువాత అమెరికా అధ్యక్షునిగా కూడా అబ్రహం లింకన్ నిరాడంబరత్వానికి పెరెన్నికగన్నాడు! అంతటి మహోన్నత వ్యక్తి అబ్రహం లింకన్!
No comments:
Post a Comment