Friday, 2 October 2015

కన్న కొడుకు పోయినా...


బులుసు సాంబమూర్తి


     " కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన " అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించాడు. అంటే " నీ విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితం గురించి ఆలోచించబోకు; దాన్ని నాకు వదిలిపెట్టు "అని తాత్పర్యం. అలాగే కష్టసుఖాలను సమానంగా పరిగణించేవాడే స్థిత ప్రగ్నుడని గీత ప్రవచిస్తున్నది. కాని, అలా వ్యవహరించగలవారెందరు?

మహర్షి బులుసు సాంబమూర్తి ఆంధ్రనాయకులలో ప్రముఖుడు. ఆయన స్వాతంత్రోద్యమంలో ఎంతో త్యాగం చేశారు.

      కాగా, 1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరుగుతున్నది. మహాసభ ఆహ్వాన సంఘానికి శ్రీ సాంబమూర్తి కార్యదర్శి. యావద్భారతం నుంచి వచ్చే ప్రతినిధులకు మూడురోజులపాటు  బోజన వసతి సౌకర్యాలు, మహాసభ ఏర్పాట్లు చూడవలసిన బాధ్యత ఆయనిది. ఏర్పాట్లన్నింటిని సాంబమూర్తిగారు చురుకుగా చేస్తున్నారు.



     దురదృష్టవశాత్తు, మహసభ మరి 10, 12 రోజులున్నదనగా, సాంబమూర్తి గారి ఏకైక పుత్రుడు టైఫాయిడ్తో మృతిచెందాడు!

గంపెడు పుత్రశోకం! అవతల పుట్టెడు బాధ్యత!

       సాంబమూర్తిగారు మనోనిబ్బరం కోల్పోకుండా ఒక ప్రక్క కన్నీరు తుడుచుకుంటూనే మరోకవంక మహాసభ మహాభారాన్ని మోసి, ఆంధ్ర భోజనం రుచిని ఉత్తరాది మహనాయకులకు చూపించి, వారి మెప్పు పొందారు. ఆయన ఆధ్వర్యాన జరిగిన సభలలో ఒకటిగా పేరొందింది!

       సాంబమూర్తిగారి పుత్రశోకాన్ని, అయినా ఆయన కర్తవ్య పరాయణత్వాన్ని వివరిస్తూ " ఇండియన్నైటింగేల్‌ " సరోజీనాయుడు  అశువుగా అప్పటికఫ్ఫుడు ఆలపించిన విషాదగీతిక సభికులను కదిలించి, కన్నీరు తెప్పించింది!

అంతటి క్రమశిక్షనను అలవరుచుకోనడం అందరికి సులభసాధ్యం కాదు.

Sunday, 27 September 2015

మా ఊరిపై బాంబులు వేయండి


జాన్‌ హాన్‌కాక్‌


    ఇలాంతి ఉదంతమే ఒకటి అమెరికా స్వాతంత్ర్య సమరం సాగుతున్న రోజులలో జరిగింది. అమెరికన్లు 18 శతాబ్ది చివరలో తమ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో పోరాడుతున్నారు. అది సాయుధ పోరాటం-అమెరికాలోని బోస్టన్నగరంలో బ్రిటీష్ సైన్యాలను జార్జివాషింగ్టన్నాయకత్వంలోని అమెరికన్సైనికులు దిగ్భందం చేశారు.

      స్వాతంత్ర సమర సేనాని అయిన వాషింగ్టన్అమెరికా పార్లమెంటుకు ఒక సందేశం పంపుతూ చక్రబంధంలో వున్న బోస్టన్పై బాంబులు వేస్తేకాని బ్రిటీష్ సైనికులు లొంగరని,అందువల్ల బోస్టన్నగరంపై బాంబులు వేయటానికి అనుమతించాలని కోరాడు.




      ఈ సందేశాన్ని పార్లమెంటు అధ్యక్షుడైన జాన్హాన్కాక్ సభవారికి ప్రశాంతంగా చదివి వినిపించాడు. సభ్యులందరు దిగ్ర్భాంతి చెందారు ఎందువల్లంటే, పార్లమెంటు అధ్యక్షుడు హాన్కాక్ ఆస్తిపాస్తులన్ని బోస్టన్నగరంలోనే వున్నాయి. నగరంపై బాంబులు వేస్తే ఆయన ఆస్తులన్నీ ధ్వంసమైపోతాయి. అందుకు హాన్కాక్ మాత్రమే కాదు, ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు? ఎలా సమ్మతిస్తారు

సభికుల సందిగ్దతను గమనించిన హాన్కాక్ గంభీరంగా లేచి నిలబడి 

        " బోస్టన్నగరంపై బాంబులు వేయటం వల్ల యుద్దం ముగిసి , మన దేశానికి బ్రిటీష్వారి నుంచి స్వాతంత్ర్యం వస్తుందంటే అంతకంటే కావలిసిందేమున్నది? నా సర్వస్వం పోతే మాత్రమేమి? బోస్టన్పై బాంబులు వేయటానికి వెంటనే ఉత్తరవు చేస్తున్నాను. " అని ప్రకటించేసరికి సభ్యులు ఆయన దేశభక్తికి, త్యాగ నిరతికి జోహార్లు అర్పిస్తూ ప్రశంసాధ్వానాలు చేశారు!

Thursday, 24 September 2015

మీరెవరి చెప్పులు తుడుస్తారు ?


అబ్రహం లింకన్


   బూట్ పాలిష్ అంటే గుర్తొంచింది. ఒకసారి అబ్రహం లింకన్తన బూట్లు తానే పాలిష్ చేసుకుంటున్నాడు. సమయమ్లో ఒక మిత్రుడు అక్కడకి వచ్చాడు

" అదేమిటి అబహం నీ బూట్లూ నువ్వే పాలిష్ చేసుకుంటున్నావ్! " అన్నాడు





       వెంటనే అబ్రహం " మరి నువ్వెవరి బూట్లు పాలిష్ చేస్తావ్!" అని అనేసరికి మిత్రుడు దానిలోని చురకను గ్రహించి చిన్నబుచ్చుకున్నాడు!

      ఆ తరువాత అమెరికా అధ్యక్షునిగా కూడా అబ్రహం లింకన్నిరాడంబరత్వానికి పెరెన్నికగన్నాడు! అంతటి మహోన్నత వ్యక్తి అబ్రహం లింకన్‌!

Tuesday, 22 September 2015

ఇందిరాగాంధి పుట్టుక రహస్యం

                                                      
ఇందిరాగాంధీ
      

         ఆమె తాత మోతీలాల్ నెహ్రూకు అతిసన్నిహితుడైన ముస్లిం మిత్రుడు వుండేవాడు. ఆయన పేరు మున్షీ ముబారక్.

ఆయనకు జవహర్లాల్ నెహ్రూకు ఒక మగబిడ్డ పుడితె చూడాలని కోర్కె. అప్పటికి ఇంకా సంతానం కలగలేదు.

    కొంతకాలానికి ముబారక్కు జబ్బుచేసి మంచంపై ఉన్నాడు. వచ్చేప్రాణం, పోయే్ప్రాణంగా వుంది. అప్పుదే జవహార్లాల్  సతీమణీ కమల ఒక బిడ్డను కన్నది. బిడ్డను మోతీలాల్ తీసుకు వెళ్ళి ముబారక్కు చూపించాడు.






    "అతడు బిడ్డను జవహర్లాల్ కుమారునిగా భావించి" మోతిలాల్ భాయ్ సాబ్! మనవడు నీ పేరు నిలుపుతాడు " అని ఆశీర్వదించాడు.


     వెంటనే మోతీలాల్ " మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల " అని చెప్పేసరికి " అలాగా! ఆడపిల్ల అయినా సరే, వందమంది కొడుకులకు దీటు అవుతుంది! " అని తిరిగి అశీర్వదించి, తరువాత  కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతే! ముబారక్ది అదే ఆఖరిమాట! అదే అక్షరల నిజమైంది. పెద్దదైన తరువాత ఇందిరాగాంధి వందమంది పురుష నాయకులకు ధీటుగా నిలిచింది. తాను సాటిలేని నాయకురాలని నిరూపించుకుంది.

Saturday, 19 September 2015

"నా భార్యను లేవదీసుకుపోతారా?"



ఆచార్య జె.బికృపలానీ

      ఆనాటి నాయకులలొ హాస్య చతురత ఎక్కువ వుండేది వారిలో కొందరు ఇతరులపై చురకలు వేయడమే కాదు, తమపై విసుర్లు విసిరినా హాయిగా నవ్వుకునేవారు.

    ఆచార్య జె.బి. కృపలానీ ప్రముఖ గాంధేయవాది మహత్మగాంధికి అనుంగ శిష్యుడు. ఆయన కాంగ్రెస్ మాహాసంస్థకు 12 సంవత్సరాలుపాటు సెక్రటరిగా పని చేసి  " సక్సస్ఫుల్ సెక్రటరీ " గా పేరు తెచ్చుకున్నారు.

      1951లో ఆయన కాంగ్రెస్ ను దిలిపెట్టి ప్రతిపక్షం లో చేరారు. కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించేవారు. అయితే, ఆయన భార్య సుజాతకృపలానీ మాత్రం ఆయనతో ఏకభవించకుండా, కాంగ్రెస్లొ చేరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిణి అయ్యారు. అప్పటికి మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి మహిళ ఆమె.




ఒక రోజున ఆచార్య కృపలానీ లోక్సభలో ప్రభుత్వ పక్షమైన కాంగ్రెస్ను తీవ్రంగా విమర్సిస్తున్నారు.

      వెంటనే ఒక కాంగ్రెస్సభ్యుడు లేచి, " అయ్యా! కృపలానీగారూ! మీరేమో కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. మీ భార్యమో మీ మాటకాదని మా పా పార్టిలోచేరి ముఖ్యమంత్రి అయ్యారు. మీ మాట మీ భార్యే వినటంలేదు! మమ్మల్ని ఎలా వినమంటారు? " అని అవహేళనగా అన్నాడు.

ఎదుటి వారికి తడుముకుండా సమాధానం చెప్పే కృపలానీ లేచి ఇలా అన్నారు:

      " మిత్రమా ఇంతవరకు కాంగ్రెస్వారు వట్టి మూర్ఖులే అనుకున్నాను. ఇప్పుడు ఇతరుల భార్యలను కూడా లేవదీసుకు వెళ్ళే రౌడీలని తెలుసుకున్నాను. "  -- అని అనేసరికి అన్ని పక్షాల సభ్యులు గొల్లుమన్నారు!


అప్పటిలో విమర్శలు అలా వ్యంగ్యోక్తులతో, హాస్యోక్తులతో వుండేవి!


Monday, 14 September 2015

" నేను మరణించానండి! "




రుడ్వార్డ్  క్లిప్పింగ్


      ఇది అప్పుడప్పుడు పత్రికలలో జరిగే తమాషా. బ్రతికి ఉన్న వ్యక్తులు మృతిచెందినట్టుగా పత్రికలలో పొరపాటున పడవచ్చు. అలా పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

      రుడ్వార్డ్  క్లిప్పింగ్ ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయత. ఆయన ఇండియాలో జన్మించాడు. తరువాత ఇంగ్లాడులో ఉండిపోయాడు. ఆయనకు ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య బహుమతి కూడ లభించింది.

     ఒకసారి ఆయన మరణించినట్లు ఒక పత్రికలో వార్త పడింది. దానిని చూచిన క్లిప్పింగ్ నిర్ఘాంతపోయి, రువాత తేరుకొని, పత్రిక ఏడిటర్కు ఒక లేఖ వ్రశారు :




        " మీరు   వార్త అయినా ప్రచురించే ముందు దాని నిజానిజాలను తెలచేసుకుంటారు కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి, నా మరణ వార్తను కూడా ఖాయం చేసుకోనే, కరెక్టు అనే వేసి ఉంటారు. నేను మరణించాను కాబట్టి, మీ పత్రిక చందాదార్ల జాబితానుంచి నా పేరు తీసివేయవలసిందిగాను, మృతినికి మీ పత్రికను ఇక పంపవలదనీ కోరుతున్నాను!"

      జరిగిన ఘోర తప్పిదానికి విచారం తెలుపుతూ, క్లిప్పింగ్కు  క్షమాపణ్ చెబుతూ ఎడిటర్ తరువాత తన పత్రికలో ప్రకటన చేశారనుకోండి! అది వేరే విషయం.







Saturday, 12 September 2015

" ఆమెలో వున్నవి నాలో లేవు "


                                                  
ఐన్‌స్టీన్‌

       ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త, సాపేక్ష సిద్దాంతకర్త ఐన్స్టీన్హాస్య సంభాషణా చతురుడు కూడా. ఒకసారి ఆయన న్యూయార్క్ నగర వీధులలో నడిచి వెలుతున్నాడు, ఆయన వెనుకనే వస్తున్న ఒక మిత్రుడు " ఐన్స్టీన్గారూ! మీరు చాల దూరం నుంచి నడిచి వస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. మీ వంక ఎవ్వరూ చూడ్డంలేదు. కాని ఉదయమే రోడ్డు వెంట ప్రసిద్ద హాలీవుడ్ అందాల తార మర్లిన్మన్రో కొంచెం దూరం వెళ్ళేసరికి ఆమెను జనం విరగబడి చూశారు్, ఇంత గొప్పవారైనా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. గొప్పతనం లేని ఆమెకు అంత విలువ దేనికి? " అన్నాడు.



         వెంటనే ఐన్స్టీన్‌ " మిత్రమా! ఆమెలో చూడ్డానికి కొన్ని విశేషాలున్నాయి. నా వద్ద ఏమున్నదని చూస్తారు? " అనేసరికి మిత్రుడు కూడా చిరునవ్వులు చిందించాడు. ఔను! సినిమా గ్లామరుకు అమెరికా ఏమిటి? ఇండియా ఏమిటి?

      కొస మెరుపు; అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు, కేంద్ర హోమ్మంత్రి, మహరాష్టృ గవర్నర్ పదవులు నిర్వహించిన కాసు బ్రహ్మనందరెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఒక సినీ తారల ఉత్సవానికి ముఖ్య అతిధిగా నేను ఆహ్వనించినప్పుడు ఆయన " సినీతారల ముందు మన ముఖాలు ఎవరు చూస్తారండి! నన్ను వదిలిపెట్టండి బాబూ " అన్నారు. ఐన్స్టీన్వ్యాఖ్య్ కూడ అలాంటిదే.

నిజం చెప్పిన కల       జేమ్స్ చాపిన్ భూ కామందు. లండన్ నగర పొలిమేరల్లో మంచి పంటనిచ్చే పొలాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం లేచి తన మూడవ కొడు...